‘నగరపురమ్’ కళాశాలలో... | nagarapuram college story | Sakshi
Sakshi News home page

‘నగరపురమ్’ కళాశాలలో...

Published Tue, Oct 1 2013 11:49 PM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM

‘నగరపురమ్’ కళాశాలలో...

‘నగరపురమ్’ కళాశాలలో...


 అఖిల్, శ్రీదివ్య జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘నగరపురమ్’. ఎన్.పి.సారథి దర్శకుడు. ఆర్.అప్పారావు నిర్మాత. అరుల్‌దేవ్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దశరథ్ ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని అరుల్‌దేవ్‌కు అందించారు.
 
 ఇప్పటివరకూ రాని కళాశాల నేపథ్య చిత్రమిదని దర్శకుడు చెప్పారు. సంగీత దర్శకునిగా తన తొలి చిత్రమిదని, పాటలన్నీ బాగా వచ్చాయని అరుల్‌దేవ్ తెలిపారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు అఖిల్, శ్రీదివ్య కృతజ్ఞతలు తెలిపారు.
 
 ఇంకా కొడాలి వెంకటేశ్వరరావు, చంద్రమహేష్, మేడికొండ మురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అజయ్ ఆనంద్, నిర్మాణం: లక్ష్మీనరసింహా సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement