రజనీతో రాధిక ఆప్టే సినిమానట! | Radhika Apte approached for Rajinikanth's next? | Sakshi
Sakshi News home page

రజనీతో రాధిక ఆప్టే సినిమానట!

Published Sun, Jul 19 2015 12:21 PM | Last Updated on Fri, Jul 12 2019 4:29 PM

రజనీతో రాధిక ఆప్టే సినిమానట! - Sakshi

రజనీతో రాధిక ఆప్టే సినిమానట!

చెన్నై: ఇప్పటికే దక్షినాదిలోని తెలుగు చిత్రాల్లో నటించి గొప్ప అభిమానాన్ని దక్కించుకున్న ప్రముఖ నటి రాధికా ఆఫ్టే ఇప్పుడు తమిళంలో సందడి చేయనుంది. ఆమె తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ సరసన నటించనున్నారని చిత్రవర్గాలు అంటున్నాయి. రజినీ త్వరలో 159వ చిత్రంలో(ఇంకా పేరు పెట్టలేదు) నటించనున్నారు. అయితే, ఈ చిత్రానికి హీరోయిన్గా ఎంపిక చేసే క్రమంలో ఇప్పటికే రాధికాతో సంప్రదింపులు పూర్తయ్యాయట. అయితే, అధికారికంగా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఈ చిత్రంలో రజినీకాంత్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. ఆగస్టు తొలివారంలో షూటింగ్ నిమిత్తం చిత్ర బృందమంతా మలేషియా వెళ్లనుంది. ఈ చిత్రానికి 'పా' దర్శకత్వం వహించనుండగా.. కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరించనున్నారు. సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. కాగా, చిత్రంలో నటించే అంశంపై రాధికను సంప్రదించగా ఆమె మాత్రం స్పందించలేదు. ఆమె తెలుగులో ధోని, లెజెండ్ వంటి చిత్రాల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement