అంజలీ... ఆదుకో! | Actress Anajali's former mentor in ICU | Sakshi
Sakshi News home page

అంజలీ... ఆదుకో!

Published Mon, Aug 25 2014 11:48 PM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

అంజలీ... ఆదుకో! - Sakshi

అంజలీ... ఆదుకో!

అంజలి దర్శకుడు కలైంజియంను ఆదుకోవాలంటూ ఆయన సన్నిహితులు అభ్యర్థిస్తున్నారు. ఏమిటి అర్థం కాలేదా? అయితే చదవండి. నటి అంజలి ప్రధాన పాత్రలో ఊరు చుట్టి పురాణం అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కలైంజియం నిర్మించ తలపెట్టారు. ఇందులో నాయకుడు కూడా ఈయనే. చిత్ర నిర్మాణం కొంత భాగం పూర్తి అయ్యింది కూడా. ఇలాంటి పరిస్థితిలో దర్శకుడు కలైంజియంకు, నటి అంజలికి మధ్య మనస్పర్థలు వచ్చారుు. దీంతో ఒకరినొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుని వ్యవహారం కేసులు, కోర్టుల వరకు వెళ్లింది. ఇప్పటికీ వీరి విభేదాలకు పరిష్కారం లభించలేదు.
 
 నటి అంజలి కలైంజియం చిత్రం చేసేది లేదని తేల్చి చెప్పేసింది. ఇలాంటి పరిస్థితిలో రుణం దొరకడంలేదు కదా ఇంతకు ముందు అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి పెరుగుతోందట. దీంతో దర్శకుడు కలైంజియం దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని నటి అంజలి అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చి ఆదుకోవాలని ఆయన సన్నిహితులు కోరుతున్నారు. ఇందుకు తమిళ చిత్ర సంఘాలు ప్రయత్నించాలని అర్థిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement