నగరిలో మీనాక్షీ దీక్షిత్ | Nagri Meenakshi Dixit | Sakshi
Sakshi News home page

నగరిలో మీనాక్షీ దీక్షిత్

Published Thu, Apr 3 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

నగరిలో మీనాక్షీ దీక్షిత్

నగరిలో మీనాక్షీ దీక్షిత్

నగరి, న్యూస్‌లైన్: సినీనటి మీనాక్షీదీక్షిత్ బుధవారం నగరికి వచ్చారు. నగరికి చెందిన ఆమె మేనేజర్ చలపతితో పాటు విచ్చేసిన మీనాక్షీ దీక్షిత్ సామాలమ్మ దేవతను, కరియ మాణిక్యస్వామిని దర్శించుకున్నారు. మాజీ సర్పంచ్ ఆనం శ్రీహరి నాయుడు స్వగృహానికి విచ్చేసిన ఆమెకు పట్టణ ప్రముఖులు శాలువాలు, పూలదండలతో ఆహ్వానించారు.

ఈ సందర్భం గా మీనాక్షీ దీక్షిత్ మాట్లాడుతూ ఈ మార్గంలో చెన్నై వెళుతుండగా ముక్కుకొండ ఆకర్షించేదన్నారు. ముక్కుకొండ ఉన్న నగరి పట్టణానికి విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. 2009లో ‘లైఫ్ స్టైల్’ చిత్రం ద్వారా సినీ రంగంలో ప్రవేశించానన్నారు. దూకుడు, బాడీగార్డ్, బాద్‌షా చిత్రాలు మంచి గుర్తింపు ఇచ్చాయన్నారు.
 
తెలుగు, తమిళం, మళయాలం, హిందీ చిత్రాల్లో నటిం చానన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘అడవికాచిన వెన్నెల’, తమిళంలో ‘జగజాల భుజబల తెనాలిరామన్’ చిత్రంలో నటిస్తున్నానని, హిందీలో ‘పీ సే పీఎం తక్’ చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నానని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement