
తమిళంలో రీమేక్‌గా గీతాంజలి
ప్రస్తుతం సినిమా రీమేక్‌ల మయం అయిపోయిందని చెప్పవచ్చు. ఒక భాషలో విజయవంతమైన చిత్రం ఇతర భాషల్లో రీమేక్ ఖాయం అవుతోంది. కారణం నమ్మకం.అక్కడ హిట్ అవడంతో ఇక్కడా ఆ సక్సెస్‌ను క్యాష్ చేసుకోవచ్చుననే ఆలోచనా కావచ్చు. అలా తాజాగా తెలుగులో నటి అంజలి టైటిల్ పాత్ర పోషించిన హారర్ కామెడీ కథా చిత్రం గీతాంజలి తమిళంలో రీమేక్ కానుందన్నది తాజా సమాచారం. హాస్యన టుడు శ్రీనివాసరెడ్డి అంజలికి జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంజలి ద్విపాత్రాభినం మంచి ప్రశంసలు అందుకుంది.
రాజ్‌కిరణ్ దర్శకత్వం వహించిన గీతాంజలి 2014లో విడుదలైంది. ఆ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్ కానుందని కోలీవుడ్ సమాచారం. అంతే కాదు ఇందులో యువ సంగీతదర్శకుడు, సక్సెస్‌పుల్ హీరో జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హలో నాన్ పేయ్ పేసురేన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై తొలి విజయాన్ని అందుకున్న ప్రసాద్ ఈ చిత్రానికి మెగాఫోన్ పట్టనున్నట్లు సమాచారం.
దీన్ని ఇంతకు ముందు పొల్లాదవన్, జిగర్‌తండా వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఫైవ్‌స్టార్ కథారేశన్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్‌గా అంజలి నటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.