వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న క్రేజీ హీరోయిన్
Published Wed, Dec 16 2015 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM
చెన్నై: వరుస ఆఫర్లతో హీరోయిన్ సమంత ఇటు తెలుగు, అటు తమిళ సినీ రంగంలో దూసుకుపోతోంది. తమిళంలో వచ్చే ఏడాదికి గాను అపుడే రెండు నూతన ప్రాజెక్టులకు ఒకే చెప్పిందట. ఈ రెండింటిలోనూ ఈ చెన్నై చిన్నది రైజింగ్ స్టార్ ధనుష్ తోనే మళ్లీ జతకడుతూ వుండటం విశేషం,. 'నవ మన్మథుడు' సినిమా ద్వారా తమిళ సూపర్ స్టార్తో మొదటి సారి జతకట్టిన ఈ అమ్మడు ఇపుడు మరో రెండు తమిళ సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం. తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో వస్తున్న 'వాడ చెన్నై' అనే మూవీలో ధనుష్కు జోడీగా సమంత నటించనుంది. అలాగే మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ గా వస్తున్న ఇంకా పేరు ఖరారు చేయని మరో చిత్రంలో కూడా సమంత యాక్ట్ చేయనుంది. ఈ రెండు వచ్చే ఏడాది సెట్స్ మీదకు రానున్నాయి.
కాగా తమిళంలో ధనుష్ సమంత హీరోహీరోయిన్లుగా నటించిన 'తంగ మగన్' తెలుగులో 'నవ మన్మధుడు' పేరుతో రిలీజ్కు సిద్ధమవుతోంది. తీర్, సూర్య హీరోగా 24 అనే మరో రెండు సినిమాలు సమంత ఖాతాలో ఉన్నాయి. అలాగే ప్రస్తుతం తెలుగులో ప్రిన్స్ మహేత్ తో బ్రహ్మోత్సవం, నితిన్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అ.. ఆ.. (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి) లు సినిమాల షూటింగ్లో బిజీబిజీగా ఉంది. మరోవైపు త్రివిక్రమ్ , సూర్యతో చేసే మరో సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈగ భామ సమంతానే మంచి ఆప్షన్ అని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు టాక్.
Advertisement
Advertisement