అలా చేస్తే నాకు నేనే బోర్ కొట్టేస్తాను!
‘‘మనకేదో ఒక విషయం మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం దేవుడైతే బాగుంటుంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. ఎందుకంటే ఏదో శక్తి ఉంది.. అది మనల్ని గమనిస్తుంటుంది అనే ఫీలింగ్ తప్పులు చేయనివ్వదు.
‘‘మనకేదో ఒక విషయం మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం దేవుడైతే బాగుంటుంది. నేను దేవుణ్ణి నమ్ముతాను. ఎందుకంటే ఏదో శక్తి ఉంది.. అది మనల్ని గమనిస్తుంటుంది అనే ఫీలింగ్ తప్పులు చేయనివ్వదు. దేవుడు అనే ఆ నమ్మకం మనల్ని హద్దుల్లో ఉండేలా చేస్తుంది అని నా అభిప్రాయం’’ అంటున్నారు సమంత.
ఏ పాత్ర చేసినా, దానికి ప్రాణం పోయడానికి శాయశక్తులా కృషి చేస్తానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు ఈ బ్యూటీ. కానీ, ఒక్కసారి కెమెరా ముందు నుంచి పక్కకు వచ్చేసిన తర్వాత, నటించడం మానేస్తానని చెప్పారు. దీని గురించి విపులంగా చెబుతూ - ‘‘నటన అనేది నా వృత్తి. టీచర్, డాక్టర్.. ఇలా రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్లు ఇంటికెళ్లిన తర్వాత నార్మల్ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తారో నేనూ అంతే. ఎలాగూ యాక్టింగ్ వచ్చు కదా అని వ్యక్తిగత జీవితంలో కూడా యాక్ట్ చేస్తే నాకు నేనే బోర్ కొట్టేస్తాను.
అందుకే ఇతరుల సంతోషం కోసమో, ఒకర్ని బాధ పెట్టడం కోసమే నేను నటించను. అందుకే పర్సనల్ లైఫ్‌లో సాధ్యమైనంతవరకు నిజాయతీగా ఉండటానికి ట్రై చేస్తా’’ అని చెప్పారు సమంత. బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచన ఉందా? అని అడిగితే -‘‘ప్రస్తుతం దక్షిణాదిన చేస్తున్నవి మంచి సినిమాలే. తమిళ చిత్రం కూడా చేయబోతున్నా. అందుకే ఇప్పట్లో బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచన లేదు. ఇక్కడ సంతోషంగానే ఉన్నా’’ అని చెప్పారు సమంత.