
నాగ్ నోట... తమిళ మాట!
ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న హీరోలు ఇంటిల్లిపాదికీ దగ్గరైపోతారు. అలా దగ్గరైనవాళ్లలో నాగార్జున ఒకరు. ఇప్పటికీ ఆయనకున్న ఫిమేల్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. ‘‘మానసికంగా ఇంకా యంగ్‌గానే ఉన్నాను. ఏ మగాడైనా ఆడవాళ్ల దృష్టిని ఆకట్టుకోవాలనుకుం టాడు. అది తప్పు కాదు. నిజం చెప్పాలంటే... ఆడవాళ్ల ఫాలోయింగ్ నాకు ఇంకా కావాలని ఉంది. ఆ ఫాలోయింగ్‌ను ఎంజాయ్ చేస్తా’’ అని నాగార్జున అన్నారు.
తెలుగు, తమిళ భాషల్లో కార్తీ, తమన్నాతో కలిసి నటించిన ‘ఊపిరి’ (తమిళంలో ‘తోళా’) గురించి మాట్లాడుతూ - ‘‘తమిళంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. నన్ను డబ్బింగ్ చెప్పమని ప్రోత్సహించింది కార్తీనే. ‘నా గొంతు వాడుకోవాలో? లేదో మీరే నిర్ణయించుకోండ’ని దర్శకుడు వంశీ పైడిపల్లి, కార్తీతో అన్నాను. నా వాయిస్ ఉంటేనే పాత్ర ఎలివేట్ అవుతుందన్నారు. దాంతో చెప్పా’’ అన్నారు.
యంగ్ ఫ్యామిలీస్‌ని... ‘పడేసావే’
శుక్రవారం విడుదలవుతున్న ‘పడేసావే’ గురించి బుధవారం జరిగిన ప్లాటినమ్ డిస్క్ వేడుకలో నాగ్ మాట్లాడారు. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శ్యామ్ ప్రధాన పాత్రల్లో నాగార్జున ప్రోత్సాహంతో అయాన్ క్రియేషన్స్ పతాకంపై చునియా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఏడు నెలల క్రితం చునియా ఈ కథ చెప్పింది. నాకు చాలా నచ్చింది. నా సపోర్ట్ కావాలని అడిగింది. ‘నువ్వు సినిమా చెయ్. చూసి, నచ్చితే ప్రమోట్ చేస్తా’ అన్నాను. సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. యంగ్ ఫ్యామిలీస్‌కి బాగా నచ్చే చిత్రం ఇది. క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయి, చూశాను. అనూప్ పాటలు, కిరణ్ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. టీమ్ అంతా కష్టపడి, ఇష్టంతో చేసిన చిత్రం ఇది’’ అన్నారు.