తిరువనంతపురం: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంకే అర్జునన్(84) సోమవారం కన్నుమూశారు. అర్జునన్ మాస్టర్‌గా పిలవబడే ఆయన కొచ్చిలోని నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు. దాదాపు 700పైగా పాటలకు సంగీతాన్ని అందించిన అర్జునన్ మాస్టర్ మాలయాళ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్నారు. 1968లో ‘కరుత పౌర్ణమి’ అనే మలయాళం సినిమాలోని పాటలకు మ్యూజిక్‌ను అందించి సంగీత దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక 2017లో ‘భయంకం’ చిత్రానికి గాను కేరళ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. ‘నీలా నిశిధిని’, ‘కస్తూరి మనక్కున్నేలో’, ‘పాడుతా వీన్యూమ్ పాడుమ్’వంటి ఎన్నో పాటలకు ఆయన సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment