Popular TV Actor Rushad Rana Got Married To Director Ketaki Today - Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ను పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఫోటోలు వైరల్

Published Wed, Jan 4 2023 6:10 PM | Last Updated on Wed, Jan 4 2023 7:13 PM

Popular TV actor Rushad Rana got married to Director Ketaki Today - Sakshi

అనుపమ సీరియల్ ఫేమ్, బుల్లితెర నటుడు రుషద్ రానా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. క్రియేటర్ డైరెక్టర్ కేటకీ వలవల్కర్‌ను ఆయన పెళ్లాడారు. బుధవారం ముంబయిలో జరిగిన వేడుకలో పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు హాజరయ్యారు. నూతన వధూవరులకు ఆశీర్వదించారు. ఈ వేడుకలో రూపాలీ గంగూలీ, సుధాన్షు పాండే, నిధి షా,  గౌరవ్ ఖన్నాతో సహా పలువురు తారలు పాల్గొని పెళ్లిలో సందడి చేశారు. 

ముంబయిలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. మరాఠీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే గతంలో ఖుష్నుమ్‌ను వివాహం చేసుకున్న రుషాద్ 2013లో విడిపోయారు. రుషద్ రానా అనుపమ సీరియల్‌తో ఫేమస్ అయ్యారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉ‍న్న ఈ జంట వివాహబంధంతో ఇవాళ ఒక్కటయ్యారు. దర్శకురాలైన కేటకీ వలవల్కర్‌ చాలా కాలంగా బాలీవుడ్ పరిశ్రమలో కొనసాగుతున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement