
బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కరణ్ కుంద్రా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రియురాలు తేజస్వినితో త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అతడు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు భోగట్టా! ముంబైలోని బాంద్రాలో ఓ లగ్జరీ ఫ్లాటును సొంతం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫ్లాటులో నుంచి చూస్తే సముద్ర తీరం కనిపిస్తుందట.
కుంద్రా కొత్తింట్లో ఓ లిఫ్టుతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని సౌకర్యాలున్న కొత్తింటి కోసం అతడు దాదాపు రూ.20 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరణ్ కుంద్రా బేచారి మ్యూజిక్ వీడియోలో నటిస్తుండగా మరోపక్క డ్యాన్స్ దీవాని జూనియన్స్ షోకు వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్నాడు. అలాగే ఇలియానా, రణ్‌దీప్ హుడాలతో కలిసి ఓ సినిమా కూడా చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment