Ishita Dutta And Vatsal Sheth Announce Pregnancy With Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Ishita Dutta - Vatsal Sheth: పెళ్లై ఐదేళ్లు, పిల్లలు వద్దనుకోలేదు.. ఇంతకాలానికి మా పంట పండింది.. నటుడు

Published Fri, Mar 31 2023 4:24 PM | Last Updated on Fri, Mar 31 2023 4:34 PM

Ishita Dutta, Vatsal Sheth Announce Pregnancy With Photos - Sakshi

బాలీవుడ్‌ జంట ఇషితా దత్తా, వత్సల్‌ సేత్‌ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను బీటౌన్‌ కపుల్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సముద్ర తీరంలో ఇషితా బేబీ బంప్‌కు వాత్సల్‌ ఆప్యాయంగా ముద్దు పెట్టిన ఫోటోలను ఇరువురూ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీనికి బేబీ ఆన్‌ బోర్డ్‌ అని క్యాప్షన్‌ జోడించారు.. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ దంపతులు తమ కుటుంబంతో గోవాలో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు.

అమ్మ కాబోతున్న ఆనంద క్షణాల కోసం ఎదురు చూస్తున్నానంటోంది ఇషిత. 'నాకెంతో ఎగ్జయిటింగ్‌గా ఉంది. అంతా కొత్తగా అనిపిస్తోంది. కడుపులో ఓ బిడ్డ పెరుగుతుందంటే ఆ అనుభవమే ఎంతో డిఫరెంట్‌గా ఉంది' అని చెప్పుకొచ్చింది. వాత్సల్‌ మాట్లాడుతూ.. మా పెళ్లై ఐదేళ్లవుతోంది. కెరీర్‌లో సెటిలయ్యాక పిల్లల గురించి ఆలోచించాలి వంటి నిబంధనలేమీ పెట్టుకోలేదు. జీవితంలో పెళ్లనేది ఎంత ముఖ్యమైన ఘట్టమో పిల్లలు మన లైఫ్‌లోకి రావడం కూడా అంతే ముఖ్యమైన విషయం. పనెప్పుడూ ఉండేదే, కానీ మన కుటుంబంలోకి చిన్నారి వస్తుందంటే జీవితంలో అందమైన అధ్యాయానికి తెర దీసినట్లే' అని పేర్కొన్నాడు.

కాగా ఏక్‌ ఘర్‌ బనౌంగా, బేపనా ప్యార్‌, తోడా సా బాదల్‌ తోడా సా పాని వంటి సీరియల్స్‌లో నటించిన ఇషితా సినిమాల్లోనూ యాక్ట్‌ చేసింది. హిందీ దృశ్యం, దృశ్యం 2లో సినిమాల్లో తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. వాత్సల్‌ సేత్‌ విషయానికి వస్తే అతడు నటుడు, మోడల్‌ కూడా! వాత్సల్‌ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ నటించాడు. టార్జాన్‌: ద వండర్‌ కార్‌, హీరోస్‌, హాస్టల్‌, మలంగ్‌ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఆదిపురుష్‌ సినిమాలో ఇంద్రజిత్తు పాత్ర పోషిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement