చెన్నై: కోలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటుడు కుట్టి రమేష్ అనారోగ్యంతో శుక్రవారం కన్నుముశారు. పలు టీవీ సీరియల్‌లలో నటించి గుర్తింపు పొందిన కుట్టి రమేష్ నిన్న(మే 14) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తమిళ విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న ‘తేన్‌మోవి’, ‘బీఏ’ వంటి మెగా సీరియల్స్‌తో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. కుట్టి రమేష్ మృతి తీరని లోటని విజయ్ టీవీ బృందం సంతాపం ప్రకటించింది.
ఇదిలా ఉండగా ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు, నాన్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్‌కు పితృవియోగం కలిగింది. ఈయన తండ్రి సెన్‌తమిళన్ శుక్రవారం అనారోగ్యంతో స్వగ్రామం శివగంగ జిల్లా అరణైయూరులో కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment