బుల్లితెర నటుడి పెంకుటిల్లు, పాక సింపుల్‌గా ఎంత బాగుందో! | TV Actor Ek NaDh Paruchuri Village Home Tour | Sakshi
Sakshi News home page

Ek NaDh Paruchuri: సీరియల్‌ నటుడి పెంకుటిల్లు చూశారా? ఎంతందంగా ఉందో!

Dec 1 2022 8:59 PM | Updated on Dec 1 2022 9:59 PM

TV Actor Ek NaDh Paruchuri Village Home Tour - Sakshi

ఇందులో గేటు తీసుకుని లోపలికి వెళ్లగానే దారికిరువైపులా బోలెడన్ని మొక్కలు, చెట్లు, తులసివనం దర్శనమిచ్చాయి. ఇంట్లోకి వెళ్లడానికి ముందు పెద్ద వరండా ఉంది.

బుల్లితెర నటుడు ఏక్‌నాధ్‌ సీరియల్స్‌ ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తూ ఉంటాడీ యాక్టర్‌. నటి, భార్య హారికతో కలిసి ఫోటోషూట్లకు పోజులివ్వడమే కాకుండా అందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో వదులుతూ ఉంటాడు. ఇటీవలే ఏక్‌నాధ్‌ పుట్టినరోజున ఖరీదైన ఐఫోన్‌ గిఫ్టిచ్చింది హారిక. ఇదిలా ఉంటే తాజాగా ఏక్‌నాధ్‌ తను పుట్టి పెరిగిన ఇంటిని చూపించాడు. 

చిట్టూర్పులోని తన పెంకుటిల్లును చూపిస్తూ హోమ్‌టూర్‌ వీడియో చేశాడు. ఇందులో గేటు తీసుకుని లోపలికి వెళ్లగానే దారికిరువైపులా బోలెడన్ని మొక్కలు, చెట్లు, తులసివనం దర్శనమిచ్చాయి. ఇంట్లోకి వెళ్లడానికి ముందు పెద్ద వరండా ఉంది. తర్వాత హాల్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌ వరుసగా ఉన్నాయి. అన్ని గదులు విశాలంగా, గంభీరంగా ఉన్నాయి.

వంట చేసుకోవడానికి ఇంటి వెనుక ప్రత్యేకంగా ఓ పాక కూడా ఉంది. ఇంటి వెనకాల కూడా అరటి, మామిడి, ఉసిరి, కొబ్బరి, దానిమ్మ, నిమ్మ, బాదం, సపోటా చెట్లతో పెద్ద తోట ఉంది. ఈ ఇంటిని చూసిన నెటిజన్లు 'పల్లెటూరి వాతావరణానికి తగ్గట్లు ఇల్లు ఎంత చక్కగా ఉందో, ఆ సామాను, ఇల్లు', 'మొక్కలు అవన్నీ చూస్తుంటే మేము గడిపిన పాతరోజులు గుర్తుకు వస్తున్నాయి', 'ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని ఊరికే అనలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: హీరోయిన్‌ ముఖంపై సూదులు, అసలేమైంది?
ఆ విషయం అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుంది: గీతూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement