Malayalam Actor VP Khalid Took His Last Breath On Film Shooting Location - Sakshi
Sakshi News home page

VP Khalid: సెట్స్‌లోనే ఆగిపోయిన నటుడి గుండె

Jun 24 2022 7:46 PM | Updated on Jun 24 2022 8:15 PM

Malayalam Actor VP Khalid Took His Last Breath On Film Shooting Location - Sakshi

ఆయన జూడ్‌ ఆంటోనీ డైరెక్ట్‌ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత వాష్‌రూమ్‌కు వెళ్లిన ఆయన తిరిగిరాకపోవడంతో వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే చిత్రబృందం ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

సీనియర్‌ నటుడు వీపీ ఖలీద్‌ (70) షూటింగ్‌ లొకేషన్‌లోనే కన్నుమూశారు. కేరళలోని వయక్కం సమీపంలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఖలీద్‌కు శుక్రవారం గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించారు. కాగా ఆయన ప్రస్తుతం దర్శకుడు జూడ్‌ ఆంటోనీ డైరెక్ట్‌ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సెట్స్‌కు వెళ్లిన ఆయన ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో అనుమానం వచ్చిన చిత్రయూనిట్‌ సభ్యులు లోనికి వెళ్లి చూడగా ఖలీద్‌ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే చిత్రబృందం ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

వీపీ ఖలీద్‌ సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేసేవారు. తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్‌లో నటించడంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆయన కుమారులు షైజు, జింసీ, ఖలీద్‌ రెహమాన్‌ ముగ్గురూ కూడా ఫిలిం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

చదవండి: రణ్‌బీర్‌ కపూర్‌ కారుకు యాక్సిడెంట్‌
ఈ సినిమాలో సూర్య, షారుక్‌లు ఫ్రీగా నటించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement