Aamir Ali Breaks Silence On His Divorce with Ex wife Sanjeeda Shaikh - Sakshi
Sakshi News home page

Aamir Ali: విడాకుల తర్వాత నా కూతుర్ని కలవలేకపోతున్నా!

Published Thu, Aug 25 2022 7:28 PM | Last Updated on Thu, Aug 25 2022 8:56 PM

Aamir Ali Breaks Silence On His Divorce with Ex wife Sanjeeda Shaikh - Sakshi

ప్రేమ-పెళ్లి-విడాకులు.. ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలివి. ప్రేమ పుట్టెనే.. అని పాటలు పాడుకునే లోపే కొందరు బ్రేకప్‌ చెప్పుకుంటే మరికొందరు మాత్రం పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే మా ప్రేమ శాశ్వతం అంటూ తమ బంధాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు.

బుల్లితెర స్టార్స్‌ ఆమిర్‌ అలీ, సంజీదా షైఖ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు. సరోగసి ద్వారా వీరికి కూరుతు ఐరా పుట్టింది. అంతలో ఏమైందో ఏమో.. తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ చెప్తూ ఆమిర్‌-సంజీదా గతేడాది జనవరిలో విడాకులు తీసుకున్నారు. కానీ విడాకులకు గల కారణాన్ని మాత్రం ఏ ఒక్కరూ బయటకు చెప్పకుండా గోప్యత పాటిస్తున్నారు.

అయితే విడాకుల తర్వాత కూతురిని కలవడానికి వీల్లేకుండా పోయిందని కుమిలిపోతున్నాడు ఆమిర్‌. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా వైవాహిక జీవితం కుప్పకూలిపోయింది. అది నన్ను ఎంతగానో కుదిపేసింది. కానీ పరిస్థితులకు కుంగిపోకూడదని తిరిగి నిలబడ్డాను. ఇప్పుడు మామూలు మనిషినయ్యాను. ఇలా జరిగినందుకు నేను ఎవరినీ శాపనార్థాలు పెట్టను. అంతేకాదు, నా మాజీ భార్యకు కూడా అంతా మంచే జరగాలని కోరుకుంటాను. ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలి.

కాకపోతే గత 10 నెలలుగా నేను నా కూతుర్ని కలిసేందుకు అనుమతించడం లేదు. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి, దీని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. దురదృష్టమేంటంటే.. ఏం జరిగినా ముందు మగవాడిదే తప్పని నిందిస్తారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను నేను ఎప్పుడూ బయటపెట్టను. నాతో కొన్నేళ్లపాటు జీవించిన వ్యక్తిని గౌరవించడం నా బాధ్యత. కాబట్టి నేనేమీ చెప్పదలుచుకోలేదు' అని ఆమిర్‌ అన్నాడు.

కాగా కొన్నేళ్లపాటు రిలేషన్‌లో ఉన్న ఆమిర్‌- సంజీదా 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరు జంటగా నాచ్‌ బలియే 3 డ్యాన్స్‌ షోలో పాల్గొని విజేతగా నిలిచారు. 2020లో వీరు విడాకుల కోసం దరఖాస్తు చేయగా ఆ మరుసటి ఏడాది అవి మంజూరయ్యాయి. అంతేగాక పాపను తల్లికే అప్పజెప్పాలని నిర్ణయించడంతో తన కూతురును సంజీదా పెంచుకుంటోంది.

చదవండి: యాక్షన్‌ మోడ్‌లో నాగ్‌.. ఘోస్ట్‌ ట్రైలర్‌ వచ్చేసింది..
గుండెపోటు.. 15 రోజుల తర్వాత స్పృహలోకి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement