TV Actor Vivian Dsena Secretly Married With Longtime Girlfriend - Sakshi
Sakshi News home page

Vivian Dsena: సీక్రెట్‌గా నటుడి రెండో పెళ్లి, ఏడాదిగా ఒకే ఇంట్లో కాపురం..

Published Sun, Mar 5 2023 4:56 PM | Last Updated on Mon, Mar 6 2023 10:46 AM

TV Actor Vivian Dsena Secretly Married With Longtime Girlfriend - Sakshi

బుల్లితెర నటుడు వివియన్‌ సేన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడట. ప్రేయసి నోరన్‌ అలీతో అతడు ఏడుగులు నడిచాడంటూ ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది. వీరు పెళ్లి చేసుకుని కొన్ని రోజులో, నెలలో కాదు ఏకంగా ఓ సంవత్సరమే అవుతోందట! ఈజిప్ట్‌కు చెందిన నోరన్‌తో అతడు ఎంతోకాలంగా డేటింగ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో గతేడాది అతడు అతికొద్ది మంది సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటినుంచి వీళ్లు కలిసే ఉంటున్నారట. ముంబై లోఖండ్‌వాలాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి జీవిస్తున్నారు. ఇదే విషయాన్ని నటుడిని అడగ్గా అతడు స్పందించడానికి నిరాకరించాడు. కాగా సేన గతంలో నటి వాబిజ్‌ దొబర్జీని పెళ్లాడాడు.  వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2021 డిసెంబర్‌ 18న విడాకులు తీసుకున్నారు.

గతేడాది వివియన్‌ రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. 'నేను నోరన్‌ అలీని ప్రేమిస్తున్నాను. నాలుగున్నరేళ్ల క్రితం మేము కలుసుకున్నాం. ఓ ఇంటర్వ్యూ కోసం ఆమె నన్ను సంప్రదించింది. నేను ఓకే చెప్పేంతవరకు దాదాపు మూడు నెలలు ఎదురుచూసింది. ఆ తర్వాత ముంబైలో ఓ పని ఉందని మా మేనేజ్‌మెంట్‌ తనను సంప్రదించారు. అప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్‌ అయ్యాం.. త్వరలోనే ప్రేమికులుగా మారాం. మా పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? జరుగుతుందనేది నాకే తెలియదు. కానీ ఒకవేళ వివాహం చేసుకున్నా దాన్ని సీక్రెట్‌గానే ఉంచుతాను. ఎందుకంటే అది నా వ్యక్తిగత విషయం. దాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించి హడావుడి చేయను. నోరన్‌కు కూడా ఇలాంటి ఆర్భాటాలు నచ్చవు. తనొక సాధారణ గృహిణిగా ఉండాలనుకుంటోంది' అని చెప్పుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement