Karthika Deepam Nirupam Paritala Remuneration, Assets, Net Worth Details - Sakshi
Sakshi News home page

Nirupam Paritala: డాక్టర్‌ బాబుకు ఎంత ఆస్తి ఉందో తెలుసా?

Published Mon, Jul 19 2021 9:13 PM | Last Updated on Tue, Jul 20 2021 10:15 AM

Karthika Deepam Actor Nirupam Paritala Remuneration And Assets - Sakshi

Nirupam Paritala Net Worth: నిరుపమ్‌ పరిటాల.. ఈ పేరు పెద్దగా తెలుసో లేదో కానీ డాక్టర్‌ బాబు అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. కార్తీకదీపం సీరియల్‌ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు నిరుపమ్‌. ఈ సీరియల్‌ ఆ రేంజ్‌లో క్లిక్‌ అయింది మరి! అప్పుడప్పుడూ సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్‌ మీద ఏదో ఒక కామెంట్‌ చేస్తూ ఉంటారు. టీఆర్పీ రేటింగ్‌లను కొల్లగొడుతోన్న ఈ సీరియల్‌ అందులోని నటీనటులను బుల్లితెర స్టార్లుగా నిలబెట్టింది. ఇదిలా వుంటే తాజాగా డాక్టర్‌ బాబు ఆస్తుల గురించి ఓ కథనం నెట్టింట వైరల్‌ అవుతోంది.

దీని ప్రకారం కార్తీకదీపం సీరియల్‌ నుంచి ఆయనకు ఒక్కరోజుకు 22 వేల రూపాయల మేర పారితోషికం ముడుతుందట. దీనితోపాటు మరో రెండు సీరియల్స్‌లో నటిస్తుండగా వాటి రెమ్యునరేషన్‌ను కలుపుకుంటే నిరుపమ్‌ రోజూవారీ సంపాదనే రూ.60 వేల పైచిలుకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.14 లక్షల పైనే సంపాదిస్తున్నాడట. అతడికి హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో రూ.80 లక్షలు విలువ చేసే ఫ్లాటు ఉండగా, విశాఖపట్నంలో రూ.5 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఉందని సమాచారం.

అంతేకాకుండా రూ.11 లక్షలు ఖరీదు చేసే రెండు కార్లు కూడా అతడి గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిరుపమ్‌ భార్య మంజుల కూడా సీరియళ్లలో నటిస్తూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అంటే నటిగా ఆమె కూడా గట్టిగానే సంపాదిస్తోంది. కాబట్టి వీరి ఆస్తుల విలువ ఇక్కడ చెప్పుకున్నదాని కంటే ఎక్కువే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నెటిజన్లు. మొత్తానికి బుల్లితెర కథానాయకుడిగా వెలుగొందుతున్న నిరుపమ్‌ హీరో రేంజ్‌లోనే సంపాదిస్తున్నాడని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement