
బుల్లితెర జంట గౌతమ్ రోడ్, పంఖురి అవస్థి త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. మరో మూడు నెలల్లో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్న బేబీకి స్వాగతం చెప్పేందుకు ఎంతో ఎగ్జయిట్‌గా ఉన్నారీ దంపతులు. పంఖురి అవస్థి గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత ఈ గుడ్‌న్యూస్‌ను అభిమానులకు వెల్లడించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ మాట్లాడుతూ.. 'తండ్రిని కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కసారి తండ్రయ్యావంటే నీకు రాత్రిళ్లు నిద్ర ఉండదని చాలామంది చెప్తున్నారు. సరే, అయితే నేను రాత్రంతా వర్కవుట్స్ చేస్తా. ఉదయం ఎలాగో నా భార్య బేబీని చూసుకుంటుంది. రాత్రిళ్లు ఆ బాధ్యత నేను తీసుకుంటా. పంఖురికి ఇప్పుడు ఆరో నెల. కడుపులో బిడ్డ తంతోది కూడా! ఎప్పుడెప్పుడు బిడ్డను ఎత్తుకుందామా? అని ఎంతగానో ఎదురుచూస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు.
పంఖురి మాట్లాడుతూ.. 'గర్భంతో ఉన్న రోజులన్ని నాకెంతో ప్రత్యేకం. నా శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అన్నీ నా మంచికే! మొదట నాకు పీరియడ్స్ రాకపోతే లేట్‌గా వస్తుందేమో అనుకున్నాను. దాన్ని ఎక్కువగా పట్టించుకోలేదు. గౌతమ్ నిద్రపోయిన తర్వాత రాత్రి నేను ఓసారి టెస్ట్ చేసుకున్నాను. పాజిటివ్ వచ్చింది. ఎంత ఆనందం వేసిందో! పెళ్లైన ఐదేళ్లకు పేరెంట్స్ కాబోతున్నాం. త్వరలో అమ్మను కాబోతున్నందుకు పట్టలేనంత సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది.
కాగా పంఖురి.. రజియా సుల్తాన్, యే హై ఆషికీ, సూర్యపుత్ర కర్ణ్, మేడమ్ సర్ వంటి పలు సీరియల్స్‌లో నటించింది. గౌతమ్ రోడ్ విషయానికి వస్తే అతడు బా బహు ఔర్ బేబీ, లక్కీ, సూర్యపుత్ర కర్ణ్, సరస్వతీ చంద్ర, కాలభైరవ రహస్య 2 వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment