బుల్లితెర పాపులర్ సీరియల్ మే రిష్తా క్యా కెహ్లాతా హై నటుడు కరణ్ మెహ్రా తన మాజీ భార్య నిషా రావల్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె రోహిత్ సేతియాతో వివాహేతర సంబంధం పెట్టుకుందని, అతడితో కలిసి తనపై దాడి చేసిందని ఆరోపించాడు. 'నిషా తానో సింగిల్ మదర్‌నంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఆమె నా ఇంట్లో ఉంటూ, నా డబ్బులే వాడుకుంటూ నా మీద కేసు గెలవాలని తపిస్తోంది. నా డాక్యుమెంట్స్, డబ్బులు, ల్యాప్‌ట్యాప్.. ప్రతీది ఆ ఇంట్లోనే ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు అమాయకురాలినని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? అదంత ఈజీ కాదు. నా ఇంటికి నేను వెళ్లడానికి అనుమతి లేకుండా పోయింది. ఒక సూట్‌కేస్‌లో ఐదు జతల బట్టలిచ్చి వెళ్లగొట్టారు. 5 నెలల నుంచి రోడ్ల మీద పిచ్చోడిలా తిరుగుతున్నా.
అక్కడ నిషా.. ఇంకా విడాకులు మంజూరు కాకముందే రోహిత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు మొదట్లో ఆమెకు రాఖీ కట్టిన అన్నగా పరిచయం చేసుకున్నాడు. కానీ వాళ్ల మధ్య ఇంత జరుగుతోందని తెలియలేదు. వాళ్లిద్దరూ కుమ్మక్కై నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టి, నామీద దాడి చేశారు. నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఆ రోహిత్ అసలు మంచివాడే కాదు. అతడికి లేని అలవాటంటూ లేదు. పొగ తాగుతాడు, మద్యం సేవిస్తాడు, గుట్కాపాన్ నములుతాడు.. అలాంటి వ్యక్తి నా ఇంట్లో నిషాతో, నా కొడుకుతో కలిసి ఉంటున్నాడు. అందుకే నా కొడుకును నాకు అప్పగించమని ఫైట్ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా కరణ్ మెహ్రా తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నిషా రావల్ తన భర్తపై గతేడాది గృహ హింస కేసు పెట్టిన విషయం తెలిసిందే! పరస్పర ఆరోపణలు చేసుకున్న ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించడమే కాకుండా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
చదవండి: వాచిపోయిన కాళ్లు... సోషల్ మీడియాలో కష్టాలు చెప్పుకున్న సోనమ్ కపూర్
అందరిముందే ఏడ్చేసిన స్టార్ హీరో!
Comments
Please login to add a commentAdd a comment