
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలు, అరెస్టు అనంతరం బాలీవుడ్ బుల్లితెర నటుడు, నాగిని 3 ఫేం పరల్ వీ పూరి తొలిసారిగా స్పందించాడు. ఈ నెల ప్రారంభంలో పరల్ వీ పూరి ఓ బాలికను కిడ్నాప్ చేసి కారులో లైంగిక దాడి చేశాడని, అంతేగాక పలు మార్లు అత్యాచారం చేసినట్లు సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పరల్ వీతో పాటు అతడి స్నేహితులను ముంబై పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పరల్ వీకి పలువురు బుల్లితెర నటులు, నిర్మాత ఎక్తాకపూర్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన పరల్ వీ దాదాపు రెండు వారాల తర్వాత మొదటిసారి పెదవి విప్పాడు.
అతడు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు షేర్ చేశాడు. ‘కాలం మనుషులను ఎప్పుడూ పరీక్షిస్తుంటుంది. ఇటీవల మా నానమ్మను కోల్పోయాను. ఆమె చనిపోయిన 17 రోజున మా అమ్మ క్యాన్సర్ బారిన పడ్డారు. ఇదే విషయాన్ని నాకు చెబుతూ నా తండ్రి పంపిన పోస్టును పోగోట్టుకున్నాను. ఆ తర్వాత ఈ భయంకరమైన ఆరోపణ. అప్పటి నుంచి ప్రతి రోజు భయంకరమైన పీడకలలు, దానికి తోడు నేరస్థుడిని అనే భావన. ఇవన్ని నన్ను తీవ్రంగా కలిచి వేశాయి. నా తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో తన పక్కన లేకుండా ఓ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను’ అంటూ భావోద్వేగాని లోనయ్యాడు. అదే విధంగా ‘ఇప్పటికి నేను దాని నుంచి బయట పడలేకపోతున్న. అయితే నా సన్నిహితులకు, స్నేహితులు, నాకు మద్దతుగా నిలిచిన నా వెల్ విషర్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకునే సమయం.
కష్టకాలంలో నా తరపున ఉండి నాకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు’ అంటూ పరల్ వీ పూరి తన పోస్టులో రాసుకొచ్చాడు. ఇక ఈ కేసులో బాధితురాలైన బాలికకు పదేళ్ల క్రితం వివాహమైందని, రెండేళ్లుగా ఆమె కనిపించడం లేదని బాధితురాలి తల్లి కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేగాక పరల్ వీ పూరికి మద్దతు ఇస్తు ఈ కేసుకు అతడికి సంబంధం లేదని, ఇవి వట్టి ఆరోపణలే అని ఆమె స్పష్టం చేసింది. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన పరల్ వీ పూరి చివరిగా ‘బ్రహ్మ రాక్షసి 2’ టీవీ సీరియల్‌లో నటించాడు. 2013లో వచ్చిన ‘దిల్ కి నజర్ సే కూబ్‌సూరత్’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన పరల్ వీ, ఆ తర్వాత ఎక్తాకపూర్ నిర్మించిన ‘నాగిని 3’, ‘బేపనా ప్యార్’ సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
చదవండి:
అత్యాచారం, వేధింపులు కేసులో ‘నాగిని 3’ నటుడు అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment