ముంబై: ప్రముఖ హిందీ నటుడు, పంజాబీ పాత్రల్లో తళుక్కున మెరిసిన మన్మీత్ గైవాల్(32) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కలత చెందడం వల్లే శుక్రవారం రాత్రి ముంబైలోని తన స్వగృహంలో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పంజాబ్‌కు చెందిన అతను ప్రస్తుతం ముంబైలోని ఖర్గార్‌లో తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలతో పాటు సినీరంగానికి బ్రేక్ పడింది. షూటింగ్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఉపాధి లేక ఆర్థిక కష్టాలు అతన్ని వెంటాడాయి. దీంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. (యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్)
ఈ క్రమంలోనే అతను ఉరేసుకుని చనిపోయినట్లు అతని ఫ్యామిలీ ఫ్రెండ్ మంజీత్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు వెల్లడించాడు. కాగా మన్మీత్ 'ఆదత్ సే మజ్బూర్', 'కుల్దీపాక్' వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నాడు. పలు టీవీ కార్యక్రమాలతో పాటు వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించాడు. ఈ మధ్యే కొన్ని వెబ్ సిరీస్‌కు కూడా సైన్ చేశాడు. కానీ లాక్‌డౌన్ వల్ల ఆ ప్రాజెక్ట్‌లు ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం పొలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (అనుమానాస్పదంగా సినీ ఆర్టిస్ట్ మృతి)
Comments
Please login to add a commentAdd a comment