![Sakshi Interview With Movie And TV Actor Bommireddipalli Perraju](/styles/webp/s3/article_images/2022/05/23/Bommireddipalli-Perraju001.jpg.webp?itok=P7KQc6Nv)
నటుడు బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు
విజయనగరం టౌన్: తెలుగు చలన చిత్రసీమలో దాదాపు 30 సినిమాల్లో నటించినప్పటికీ బుల్లితెర నటుడిగానే బాగా గుర్తింపు వచ్చింది. స్టార్ మాలో వచ్చే గృహలక్ష్మి సీరియల్ ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. 69 ఏళ్ల వయసులో అలవోకగా నటిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు జిల్లాకు చెందిన బొమ్మిరెడ్డిపల్లి పేర్రాజు. ఆదివారం విజయనగరం వచ్చిన ఆయన సాక్షితో కాసేపు ముచ్చటించారు. ఆ ముచ్చట్లన్నీ ఆయన మాటల్లోనే.. జిల్లా కేంద్రంలోని కానుకుర్తివారి వీధిలో పుట్టాను.
చదవండి: సినీనటుడు ఆలీ సడన్ సర్‌ప్రైజ్.. ఎవరికీ చెప్పకుండా..
1969లో కోరుకొండ సైనిక్ స్కూల్ జాయినై రెండేళ్ల పాటు చదివి, అనివార్య కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాను. మిత్రుడు నాలుగెస్సుల రాజుతో కలిసి మెట్రిక్యులేషన్ పూర్తిచేశాను. అనంతరం ఎంఆర్ కళాశాలలో ఇంటర్, బీకామ్ పూర్తిచేశాను. ఫ్రెండ్స్‌తో కలిసి ఢిల్లీ టూర్ వెళ్లినప్పుడు ఓ పత్రికలో వచ్చిన క్లిప్లింగ్ ఆధారంగా ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు దరఖాస్తు చేయగా, ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది.
28 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసి హిందీ, తెలుగు, పంజాబీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాను. సినిమా ఇండస్ట్రీ వాళ్లు ఢిల్లీ టూర్‌కి వచ్చినప్పుడు నాతో బాగా మాట్లాడేవారు. ఈ సమయంలో అల్లు అరవింద్ గారితో పరిచయం జరిగింది. వలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న తర్వాత హైదరాబాద్‌కి వచ్చాను. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను కలవడంతో అల్లు అర్జున్ నటించిన హ్యాపీ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
తర్వాత స్టాలిన్, డాన్, హోమం, తదితర 30 చిత్రాలలో నటించాను. చిత్రసీమలో అంతగా పేరు ప్రఖ్యాతులు రాకపోవడంతో టీవీ సీరియళ్లపై దృష్టి సారించాను. ఈ సమయంలో స్టార్ మాలో ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మిలో నటించే అవకాశం వచ్చింది. ఈ సీరియల్ నా జీవితానికి ఓ టర్నింగ్ పాయింట్. ఇప్పటివరకు 26 సీరియళ్లలో నటించాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లైఫ్ మెంబర్‌గా ఉన్నాను.
Comments
Please login to add a commentAdd a comment