'Om Shanti Om' Actor Nitesh Pandey Passes Away At 51 - Sakshi
Sakshi News home page

Nitesh Pandey: హోటల్‌లో శవమై కనిపించిన ప్రముఖ నటుడు

Published Wed, May 24 2023 12:29 PM | Last Updated on Wed, May 24 2023 3:52 PM

Bollywood Actor Nitesh Pandey Passes Away At 51 Nashik - Sakshi

చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నితేశ్‌ పాండే(51) కన్నుమూశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గత రాత్రి షూటింగ్‌ ముగించుకుని హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న నితీశ్‌ విగతజీవిగా కనిపించారు. గుండెపోటుతో ఆయన మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. కాగా ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు.

నితేశ్‌ మరణవార్తపై ఆయన బంధువు, నిర్మాత సిద్దార్థ్‌ నగర్‌ స్పందిస్తూ.. 'అవును, ఆయన మనల్ని వదిలి వెళ్లిపోయారు. నా సోదరి అర్పిత పాండే(నితేశ్‌ భార్య) షాక్‌లో ఉంది. ఆమెతో పాటు నితేశ్‌ తండ్రి కూడా మధ్యాహ్నంకల్లా ఇక్కడ ఉంటారు. మాకంతా షాకింగ్‌గా ఉంది. మాటలు రావడం కూడా కష్టమవుతోంది. తను నా కంటే చిన్నవాడు. తనకెలాంటి అనారోగ్య సమస్యలు లేవు' అని తెలిపారు.

కాగా నితేశ్‌ ప్రముఖ టీవీ సీరియల్‌ అనుపమతో పాటు కుచ్‌ తో లాగ్‌ కహేంగే, ప్యార్‌ కా దర్ద్‌ మీఠా మీఠా ప్యారా ప్యారా, ఏక్‌ రిష్తా సాజేదారి కా వంటి పలు సీరియల్స్‌లో నటించారు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటారు. ఓం శాంతి ఓమ్‌ సినిమాలో షారుక్‌ ఖాన్‌ అసిస్టెంట్‌గా నటించారు. బదాయి దో, దబాంగ్‌ 2, మదారి వంటి పలు చిత్రాల్లో నటించారు. అభయ్‌, వాట్‌ ద ఫోక్స్‌ వంటి పలు వెబ్‌ సిరీస్‌లోనూ యాక్ట్‌ చేశారు.

చదవండి: హీరోయిన్‌ రంభ కూతురిని చూశారా? అచ్చం తల్లిలాగే ఉందిగా
విషాదం.. కారు ప్రమాదంలో నటి మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement