Serial Actor Nirupam Paritala Buys Jewellery For Wife Manjula, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Manjula Nirupam: ఏడువారాల నగలు కొనిచ్చిన కార్తీకదీపం నటుడు

Published Sun, Jun 26 2022 2:43 PM | Last Updated on Sun, Jun 26 2022 3:32 PM

Karthika Deepam Actor Nirupam Paritala Buys Jewellery For Wife Manjula - Sakshi

షాపింగ్‌.. ఈ పేరు వింటే చాలు అమ్మాయిలకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఎన్నిసార్లు షాపింగ్‌ చేసినా, ఎన్నిగంటలు తిరిగినా వారికి అలుపనేదే రాదు. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టుగా డ్రెస్సింగ్‌, నగలు ఉండాలని తహతహలాడుతుంటారు లేడీస్‌. అందులోనూ సెలబ్రిటీలు ఓ మెట్టు పైనే ఉంటారు. జనాలకు బోర్‌ కొట్టకుండా నిత్యనూతనంగా కనిపించేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారి షాపింగ్‌ చిట్టా పెద్దగానే ఉంటుంది. పండగలకు, ఫంక్షన్లకు, పూజలకు, పునస్కారాలకు ఇలా ప్రతిదానికి ఏదో ఒక వంక పెట్టుకుని ఛలో షాపింగ్‌ అంటుంటారు.

తాజాగా డాక్టర్‌ బాబు (కార్తీకదీపం నటుడు నిరుపమ్‌) భార్య కూడా షాపింగ్‌ చేసేందుకు వెళ్లింది. సత్యనారాయణ వ్రతం ఉందంటూ ఆభరణాలు కొనుగోలు చేసింది. ఈసారి ఏకంగా ఏడువారాల నగలు తన భర్తతో  కొనుగోలు చేయించింది. కాకపోతే అవి పూర్తి బంగారంతో చేసినవి కాదు. 92.5 స్వచ్ఛమైన వెండి మీద బంగారం పూతపూసి తయారు చేసినవి. అంటే బంగారం లాంటి వెండి నగలు సొంతం చేసుకుందన్నమాట. ఈ షాపింగ్‌ దెబ్బతో డాక్టర్‌ బాబు.. అమ్మాయిలకు బట్టలు, నగలు పిచ్చి అని అది ఎప్పటికీ పోదని కామెంట్‌ చేశాడు.

చదవండి: విడాకులు తీసుకోనున్న మరో టాలీవుడ్‌ జంట?
ఆ బాధ గురించి ఎలా చెప్పాలో మాటలు కూడా రావట్లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement