![Pearle Maaney and Srinish Aravind Reveals Their Second Baby Name - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/10/pearl-maaney.jpg.webp?itok=jCuVUtJg)
పర్ల్ మానే.. మొదట్లో పాటల ప్రోగ్రామ్‌కు, తర్వాత వంట ప్రోగ్రామ్, డ్యాన్స్ షో.. ఇలా దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది. యాంకర్‌గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్సులూ అందుకుంది. సహాయ నటిగా క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ మలయాళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. నాగశౌర్య 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో వైదేహి అనే పాత్రలో యాక్ట్ చేసింది.
బిగ్‌బాస్ షోలో లవ్
ఇకపోతే ఈమె బిగ్‌బాస్ షోలో బుల్లితెర నటుడు శ్రీనిష్ అరవింద్‌తో లవ్‌లో పడింది. షో అయిపోగానే పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో పెళ్లి పీటలెక్కగా 2021లో నీల అనే కూతురు జన్మించింది. ఈ ఏడాది జనవరి 13న మరోసారి కూతురు పుట్టింది. తాజాగా ఈ పాపకు నామకరణం చేశారు. రెండో కూతురికి 'నితారా శ్రీనిష్' అన్న పేరు ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో తెలిపారు.
పాప పుట్టి 28 రోజులు..
'నితారా శ్రీనిష్ జన్మించి 28 రోజులవుతోంది. ఇది తన బారసాల. మా మనసులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. మీ ఆశీర్వాదాలు కావాలి..' అంటూ ఫ్యామిలీ ఫోటోలను పర్ల్ మానే, శ్రీనిష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు నటి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీ కుటుంబం చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: 'దేవర'లో ఎన్జీఆర్‌కు జోడీగా శ్రుతి మరాఠే.. ఇన్‌స్టాలో వెరీ పాపులర్
Comments
Please login to add a commentAdd a comment