మలయాళ సీరియల్ నటుడు కార్తీక్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది. వారం రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. గత వారం మౌనరాగం సీరియల్ షూటింగ్ ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ(కేఎస్‌ఆర్టీసీ) బస్సు ఆయనను వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిపోయిన ఆయనను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. తలకు, కాలికి బలమైన గాయాలు తగిలినట్లు వైద్యులు గుర్తించారు.
తాజాగా నటి బీనా ఆంటోని.. కార్తీక్ హెల్త్ అప్‌డేట్ వెల్లడించింది. 'కార్తీక్ పరిస్థితి ఎలా ఉందని చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు. నిజంగా తన పరిస్థితి ఏమీ అంత బాగోలేదు. నడవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. రెండు కాళ్ల చర్మం ఊడిపోయింది. అక్కడ మాంసం ముద్ద కూడా లేదట! ఇప్పటికే రెండు, మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేశారు. ఇంకా చేయాలంటున్నారు. కార్తీక్‌తో మాట్లాడలేదు కానీ అతడి భార్యతో మాట్లాడాను. భరించలేనంత నొప్పి ఉండటంతో పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారట!' అని చెప్పుకొచ్చింది.
చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ..
Comments
Please login to add a commentAdd a comment