
Nisha Rawal Opens Up On Karan Mehra's Extra-Marital Affair: టీవీ నటి నిషా రావల్ తన మాజీ భర్త, నటుడు కరణ్ మెహ్రాతో విడాకులపై మరోసారి స్పందించింది. కంగనా రనౌత్ హోస్ట్‌గా వస్తున్న లాక్‌అప్ రియాలిటీ షోలో నిషా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె గతేడాది తన జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభావాన్ని గర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాయల్ రోహత్గీతో వివాహేతర సంబంధం బహిర్గతం అనంతరం తనని ఒంటిరిగా వదిలేసి తమ కుమారుడు కవిష్‌ను తీసుకుని ముంబై వెళ్లిపోయాడంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.
చదవండి: ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్
అలాగే ‘‘పాయల్ రాస్తోంగి కరణ్ సీక్రెట్‌గా మాట్లాడం చూసి నాకు అనుమానం వచ్చింది. దీంతో కరణ్‌ను నిలదీశాను. దీనికి అతడు ‘అవును నేను మరోకరితో ప్రేమలో ఉన్నాను. 5, 6 నెలలగా నేను, పాయల్ సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నాం. నేను తనను ప్రేమిస్తున్నాను. అలాగే నిన్ను కూడా ఇష్టపడుతున్నా’ అని నాతో చెప్పాడు. అతడి మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇక కరణ్‌ను మరోసారి నమ్మి మోసపోవాలనుకోలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పింది. అంతేకాదు ‘కరణ్-పాయల్‌ల వివాహేతర సంబంధం బయట పెట్టాక మా మధ్య తరచూ గొడవలు అయ్యేవి.
చదవండి: ఆగిపోయిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ లైవ్ స్ట్రీమింగ్, అసలేమైందంటే..
ఈ క్రమంలో కరణ్ నన్ను మానసికంగా, భౌతికంగా గాయపరిచాడు. అవే గాయాలతో మీడియా ముందుకు వచ్చిన నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. కెచప్ రాసుకుని నాటకాలు ఆడుతుందంటూ ఈ సమాజం నన్ను నిందించింది’ అంటూ నిషా రావల్ కన్నీటి పర్యంతమైంది. కాగా గతేడాది నిషా రావల్, కరణ్‌ల విడాకుల వ్యవహరంగా బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. భర్త తనని వేధిస్తున్నాడని, భౌతికంగా గాయపరిచాడంటూ ఆమె పోలీసులను, మీడియాను ఆశ్రయించడంతో ఈ విషయం ఒక్కసారిగా పరిశ్రమలో గుప్పుమంది. ఈ కేసులో నటుడు కరణ్ మెహ్రా అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అతడు బెయిల్‌పై బయటకు కూడా వచ్చాడు.