
బుల్లితెర నటీనటులు షీన్ దాస్, రోహన్ రాయ్ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. పియా అల్బెలా సీరియల్‌లో నటించిన వీరిద్దరూ ఏప్రిల్ 22న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కశ్మీర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుకగా వీరి వివాహం జరిగింది. తమ పెళ్లి ఫోటోలను షీన్ దాస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షీన్ దాస్ ఎరుపు రంగు చీరలో మెరిసిపోతుండగా కొత్త పెళ్లికొడుకు రోహన్ గోల్డెన్ షేర్వానీ ధరించాడు. వీరిని చూసిన అభిమానులు ఎంత ముచ్చటగా ఉన్నారో అంటూ కొత్త జీవితం ఆరంభించిన నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
కాగా రోహన్ రాయ్‌కు గతంలో దిశా సాలిన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆమె మేనేజర్‌గా వ్యవహరించింది. 2020లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు దిశ 14వ అంతస్థు నుంచి దూకి మరణించింది. ఆ తర్వాత తీవ్ర బాధలో కూరుకుపోయిన రోహన్ రాయ్ అనుకోకుండా షీన్ దాస్‌తో ప్రేమలో పడ్డాడు. తనతో ఏడడుగులు నడిచి ప్రేమను పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నాడు.
చదవండి: పిచ్చి వేషాలు అని తిట్టిన నిర్మాతకు ఇచ్చిపడేసిన సామ్
Comments
Please login to add a commentAdd a comment