
పండగపూట కొత్త కారును ఇంటికి తీసుకొచ్చిన సందర్భంగా నటుడు, తన ఫ్యామిలీతో కలిసి కారు ముందు ఫొటోలకు పోజిచ్చాడు....
Dilip Joshi Buys Swanky New SUV: బుల్లితెర నటుడు దిలీప్ జోషి దీపావళి పండగకు కొత్త కారు కొన్నాడు. ఖరీదైన కియా సోనెట్ సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. దీని విలువ ఎంతనుకుంటున్నారు? అక్షరాలా రూ12.29 లక్షలు. పండగపూట కొత్త కారును ఇంటికి తీసుకొచ్చిన సందర్భంగా నటుడు, తన ఫ్యామిలీతో కలిసి కారు ముందు ఫొటోలకు పోజిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. కాగా తారక్ మెహతా కా ఉల్టా చష్మా సీరియల్‌తో చిన్నపాటి స్టార్‌గా మారిపోయాడు దిలీప్ జోషి.
తనకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయని కానీ ప్రస్తుతం జీతాలాల్(తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో అతడు చేస్తున్న రోల్) పాత్రతోనే సంతోషంగా ఉన్నానంటున్నాడీ బుల్లితెర స్టార్. ఈ ధారావాహికకు ధర్మేశ్ మెహతా, ధీరజ్ పల్‌శేట్కర్, మాలవ్ రాజ్దా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీరియల్‌లో శైలేష్, మున్మున్ దత్తా, సునయన ఫోజ్‌దార్, అమిత్ భట్ సహా తదితరులు నటిస్తున్నారు. ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తున్న ఈ సీరియల్ 2008 జూలైలో ప్రారంభమైంది. అప్పటినుంచి ఇది సుదీర్ఘకాలంగా విజయవంతంగా కొనసాగుతోంది.
#jethalal of #tarakmehtakaultachashma with family as he buys new car this Diwali pic.twitter.com/eXu9qjoBAg
— Viral Bhayani (@viralbhayani77) November 6, 2021