బిగ్‌బాస్ హిందీ 13వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు పరాస్ చాబ్రా గుడ్ న్యూస్ చెప్పాడు. కొత్త కారు కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కార్ల షోరూమ్‌కు వెళ్లిన పరాస్ మెర్సిడిస్ బెంజ్ కారు కొన్నాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆ ఆనందకర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పరాస్‌కు షోరూమ్ నిర్వాహకులు పుష్ప గుచ్ఛంతో ఆహ్వానం పలికారు. అనంతరం నటుడు తన కొత్త కారును ఓసారి నడపడంతోపాటు లోపల ఎలా ఉందో కూడా చూపించాడు. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ పరాస్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇకపోతే ఈ కారు ధర రూ.50 లక్షల పైనే అని తెలుస్తోంది.
కాగా కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న పరాస్ ఇటీవలే దానినుంచి కోలుకున్నాడు. దీని గురించి అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ప్రతిదానికి ఆందోళన చెందేవాడిని. దీనికోసం చికిత్స తీసుకుంటున్నా. చాలారోజుల తర్వాత మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాననిపిస్తోంది. నేను సంప్రదించిన డాక్టర్ నన్ను కోలుకునేలా చేశాడు. నా వృత్తిలో వరుసగా ఛాన్సులు రావు. కొన్నిసార్లు రెండు ప్రాజెక్టుల మధ్య గ్యాప్ వస్తుంటుంది. దీంతో నేను చాలా టెన్షన్ పడేవాడిని. కానీ చిత్రపరిశ్రమలో అలాంటివి సర్వసాధారణమని చెప్తూ తిరిగి నన్ను సాధారణ స్థితికి తీసుకొచ్చాడు' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: భార్యకు చిత్రహింసలు.. ఇంటివైపు కన్నెత్తి చూడని నటుడు
Comments
Please login to add a commentAdd a comment