![Sania Mirza Family Breaks Silence After Shoaib Malik Shares Wedding Pictures With Sana Javed - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/21/saina.jpg.webp?itok=smVH2n0p)
పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవైపు సానియా మీర్జాతో విడాకులపై వదంతులు ప్రచారం అవుతుండగానే.. నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చాడు. ఎప్పటినుంచో వినిపిస్తున్న రూమర్స్‌ను షోయబ్ నిజం చేశాడు.
సనా జావెద్‌ను వివాహమాడిన ఫోటోలను మాలికే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇదే విషయం ఇరు దేశాల క్రీడా వర్గాల్లో చర్చానీయంశమైంది. ఇక ఈ విషయంపై సానియా కుటుంబం తాజాగా స్పందించింది. కొన్ని నెలల క్రితమే సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నట్లు తెలిపింది.
"సానియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆమె స్పందించక తప్పట్లేదు. షోయబ్, ఆమె విడాకులు తీసుకొని కొన్ని నెలలు అవుతోంది. షోయబ్‌కు తన న్యూ జర్నీ కోసం ఆమె శుభాకాంక్షలు తెలిపింది. ఇక అనవసర చర్చలు ఆపేయండి.
ఆమె తన జీవితంలో చాలా కఠినమైన దశను ఎదుర్కొంటుంది. ఇటువంటి సమయంలో అభిమానులు, శ్రేయోభిలాషులందరూ ఆమెకు అండగా నిలవాలి. తన గోప్యతకు ఎటువంటి భంగం కలిగించకుండా గౌరవించాలని" ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2010లో తన మొదటి భార్య ఆయేషాతో విడాకులు తీసుకున్న షోయబ్ మాలిక్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ 2018లో ఇజహాన్ పుట్టాడు.
చదవండి: #ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు?
Comments
Please login to add a commentAdd a comment