Sania Mirza in Doubles Final at Ostrava Open: ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించేందుకు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా విజయం దూరంలో నిలిచింది. చెక్ రిపబ్లిక్‌లో జరుగుతున్న ఒ్రస్టావా ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో సానియా మీర్జా (భారత్)–షుయె జాంగ్ (చైనా) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–షుయె జాంగ్ జోడీ 6–2, 7–5తో ఇరి హొజుమి–మకోటో నినోమియా (జపాన్) జంటను ఓడించింది.
81 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా–షుయె జాంగ్ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. నేడు జరిగే ఫైనల్లో కైట్లిన్ (అమెరికా)–ఎరిన్ (న్యూజిలాండ్) జోడీతో సానియా జంట ఆడుతుంది.
చదవండి: Delhi vs Rajasthan: రాజస్తాన్ కెప్టెన్ సామ్సన్‌కు మళ్లీ భారీ జరిమానా..
Comments
Please login to add a commentAdd a comment