భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. బుధవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్‌లో ఓడిన సానియా మీర్జా భావోద్వేగంతో ఒక నోట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 2015 మహిళల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్‌ను సానియా గెలుచుకుంది. అయితే సానియా తన కెరీర్‌లో ఇప్పటి వరకు వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. ఇక తన టెన్నిస్ కెరీర్‌లో ఆరు సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా సానియా నిలిచింది. ఇక డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో తనకిదే చివరి ఏడాది ఇంతకుముందు సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
"క్రీడలు మీ నుంచి చాలా తీసుకుంటాయి. క్రీడలు మనల్ని మానసికంగా, శారీరకంగా అలసటకు గురి చేస్తాయి. గంటల తరబడి కష్టపడి ఓడిపోయిన తర్వాత నిద్రలేని రాత్రులు మిగులుతాయి. కానీ ఇవన్నీ చాలా ప్రతిఫలాన్ని ఇస్తాయి.. ఏ ఇతర ఉద్యోగాలు ఇలాంటివి ఇవ్వలేవు. అందువల్ల నేను ఎప్పటికీ క్రీడలకు కృతజ్ఞరాలునే. కన్నీళ్లు,పోరాటం, ఆనందం నా క్రీడా జీవితంలో భాగం. వింబుల్డన్‌లో ఆడడం ఒక అద్భుతం. ఈసారి వింబుల్డన్‌లో ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలాను. ఇక గత 20 ఏళ్లుగా వింబుల్డన్‌లో ఆడడం గౌవరంగా భావిస్తున్నాను. ఐ విల్ మిస్ యూ ’’ అని సానియా పేర్కొంది.
చదవండి: IND-W Vs SL-W: అఖరి వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
Comments
Please login to add a commentAdd a comment