ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరల్డ్ నంబర్ 1, సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ అదరగొడుతున్నాడు. జకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 35 ఏండ్ల అడ్రియన్ మన్నారినోను జకో చిత్తుగా ఓడించాడు. . వరుస సెట్లలో జోరు కొనసాగించిన ఈ సెర్బియా స్టార్ 6-0, 6-0, 6-3తో అలవోకగా గెలుపొంది రికార్డు స్థాయిలో 58వ సారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా మూడో రౌండ్ అనంతరం సోనీ స్పోర్ట్స్‌కు జకోవిచ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కూడా పాల్గోంది. భారత్‌తో తనకు మంచి సంబంధం ఉందని, అక్కడ టెన్నిస్ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జకోవిచ్ తెలిపాడు.
"భారత్‌తో నాకు గొప్ప అనుబంధం ఉంది. సెర్బియా, భారతదేశ చరిత్రను పరిశీలిస్తే చాలా సారూప్యతలు ఉన్నాయి. నాకు భారతీయలు అంటే చాలా ఇష్టం. వారు ఎల్లప్పుడూ నన్ను అభిమానుస్తునే ఉంటారు. భారతీయలకు ప్రేమభిమానాలు ఎక్కువ. ఇండియన్స్ క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. భారత్‌లో క్రికెట్ ఒక మతంగా ఉన్నప్పటికీ.. టెన్నిస్‌ను కూడా ఎక్కువగా ఆదరిస్తారు.
నేను దాదాపు పదేళ్ల క్రితం న్యూ ఢిల్లీలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లాను. రెండు రోజులు పాటు అక్కడే ఉన్నాను. మళ్లీ ఇండియాకు రావాలనుకుంటున్నాను. భారత్‌లో పిల్లల అభివృద్ధికి ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని కార్యక్రమాలలో భాగం కావాలని ఆశిస్తున్నాను. ఇటువంటి సేవా కార్యక్రామాలు నా భార్యకు కూడా ఎంతో ఇష్టం.
అదే మా ఫౌండేషన్ లక్ష్యం కూడా. అదే విధంగా భారత్‌లో టెన్నిస్ అభివృద్దికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నేను భాగం కావాలనకుంటున్నను. ఎక్కువ మంది పిల్లలు టెన్నిస్ రాకెట్ పట్టుకుని టెన్నిస్ ఆడటం నాకు చాలా ఇష్టం. టెన్నిస్ అభివృద్దికి నేను అన్ని విధాలగా కృషి చేస్తాను. ఈ మిషన్ కోసం మనమిద్దరం కలిసి పనిచేద్దాం" అని సానియా మీర్జాతో జకోవిచ్ పేర్కొన్నాడు.
చదవండి: #ShoaibMalikSaniamirza: 'షోయబ్‌తో విడాకులు తీసుకుని కొన్ని నెలలైంది.. కానీ ఇప్పుడు తప్పట్లేదు'
Comments
Please login to add a commentAdd a comment