Shoaib Malik Post for Sania Mirza Amid Divorce Rumours Goes Viral
Sakshi News home page

Sania Mirza- Shoaib Malik: సానియా మీర్జా బర్త్‌డే.. షోయబ్‌ మాలిక్‌ పోస్ట్‌ వైరల్‌

Published Tue, Nov 15 2022 11:01 AM | Last Updated on Tue, Nov 15 2022 11:26 AM

Shoaib Malik Post For Sania Mirza Goes Viral Amid Divorce Rumours - Sakshi

సానియా మీర్జాతో షోయబ్‌ మాలిక్‌ (PC: Shoaib Malik Instagram)

Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పుట్టినరోజు నేడు. ఆమె ఈరోజు(నవంబరు 15) 36వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా సానియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

లవ్‌ యూ ఫరా
ఈ క్రమంలో సానియా మీర్జా బెస్ట్‌ ఫ్రెండ్‌, బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌,దర్శకురాలు ఫరా ఖాన్‌.. సానియా కేక్‌ కట్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన సానియా.. ‘‘లవ్‌ యూ’’ అంటూ బదులిచ్చారు.

షోయబ్‌ విషెస్‌
ఇదిలా ఉంటే.. సానియా వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల పలు వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. భర్త షోయబ్‌ మాలిక్‌కు దూరంగా ఉంటున్న ఆమె విడాకులకు సిద్ధమయ్యారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సానియా బర్త్‌డే సందర్భంగా షోయబ్‌ చేసిన పోస్టు వైరల్‌ అవుతోంది.

అవన్నీ అబద్ధాలేనా?
భార్య కళ్లల్లోకి ఆప్యాయంగా చూస్తూ ఉన్న ఫొటోను పంచుకున్న ఈ వెటరన్‌ క్రికెటర్‌.. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సంతోషాలతో నీ జీవితం విలసిల్లాలి. నీదైన ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు’’ అంటూ ఆమెను విష్‌ చేశాడు. ఈ ఫొటో చూసిన షోయబ్‌ ఫ్యాన్స్‌.. ‘‘విడాకుల రూమర్లు అబద్ధమని తేలినట్లేగా! మీది చూడముచ్చటైన జంట. మీరిలా ఎల్లప్పుడూ కలిసే ఉండాలి’’ అంటూ ఆకాంక్షిస్తున్నారు.


కొడుకుతో సానియా- షోయబ్‌

సరిహద్దులు దాటిన ప్రేమ
పాకిస్తాన్‌కు చెందిన ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించిన సానియా.. 2010 ఏప్రిల్‌లో అతడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమారుడు ఇజహాన్‌ సంతానం. ఇక ఓ మోడల్‌తో షోయబ్‌ ప్రేమలో పడ్డాడని, అందుకే సానియాను దూరం పెట్టడంతో ఆమెకు విడాకులకు సిద్ధమయ్యారని పాక్‌ మీడియాలో ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సానియాతో కలిసి మీర్జా మాలిక్‌ షో చేస్తున్నట్లు ప్రకటించడం సహా ఇలా భార్య పుట్టిన రోజున షోయబ్‌ విషెస్‌ తెలపడం గమనార్హం.  

చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్‌.. ముక్కలైన హృదయం అంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement