
స్ట్రాస్‌బర్గ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్రాన్స్‌లో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా–హర్డెస్కా ద్వయం 6–3, 6–3తో కైట్లిన్ క్రిస్టియన్ (అమెరికా)–లిద్జియా మరోజవా (రష్యా) జంటపై గెలిచింది. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–హర్డెస్కా జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. నేడు జరిగే ఫైనల్లో నికోల్ (అమెరికా)–దరియా సావిల్లె (ఆస్ట్రేలియా) జంటతో సానియా–హర్డెస్కా తలపడతారు.
Comments
Please login to add a commentAdd a comment