Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం | Naomi Osaka Withdraws From Indian Wells Tennis Tourney | Sakshi
Sakshi News home page

Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం

Published Fri, Sep 24 2021 7:56 AM | Last Updated on Fri, Sep 24 2021 10:04 AM

Naomi Osaka Withdraws From Indian Wells Tennis Tourney - Sakshi

టోక్యో: వచ్చే నెలలో జరిగే ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ నుంచి మాజీ చాంపియన్‌ నయోమి ఒసాకా వైదొలిగింది. ఇటీవల యూఎస్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఒసాకా అనూహ్యంగా మూడో రౌండ్‌లో కెనడాకు చెందిన లేలా ఫెర్నాండెజ్‌ చేతిలో ఓడింది. ఆ ఓటమి అనంతరం మళ్లీ తాను రాకెట్‌ పట్టేది ఎప్పుడో తనకు కూడా తెలీదంటూ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత ఒసాకా ఆటకు నిరవధిక విరామాన్ని ప్రకటించింది. ఇండియన్‌ వెల్స్‌ టోర్నీ అక్టోబర్‌ 4 నుంచి 17 వరకు జరగనుంది.    

Ostrava Tennis Tournament: ఒస్ట్రావా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి సానియా మీర్జా–షుయె జాంగ్‌ (చైనా) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చెక్‌ రిపబ్లిక్‌ లో జరుగుతున్న ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో సానియా–షుయె జంగ్‌ ద్వయం 6–7 (3/7), 7–5, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఇమీనా బెక్టాస్‌ (అమెరికా)–తారా మూర్‌ (బ్రిటన్‌) జోడీపై నెగ్గింది.

చదవండి:  Ind W Vs Aus W 2nd ODI: నిలవాలంటే గెలవాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement