దుబాయ్‌లో రెండు వారాలు ఇలా: సానియా మీర్జా ఫొటోలు వైరల్‌ | Mirror Selfie: Inside Sania Mirza Fun Filled Cosy Dubai Vacation With Family, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Sania Mirza Dubai Vacation Photos: దుబాయ్‌లో రెండు వారాలు ఇలా: సానియా మీర్జా ఫొటోలు వైరల్‌

Published Wed, Mar 6 2024 4:57 PM | Last Updated on Wed, Mar 6 2024 5:23 PM

Mirror Selfie: Inside Sania Mirza Fun Filled Cosy Dubai Vacation With Family - Sakshi

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా కుటుంబంతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు. ప్రతికూల భావనలు దరిచేరకుండా తన చుట్టూ పూర్తి సానుకూల వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు.

చిన్నారి కుమారుడు ఇజహాన్‌, తన చెల్లెలు ఆనం మీర్జాతో కలిసి దుబాయ్‌ పర్యటనలో సానియా ఆహ్లాదంగా గడిపారు. ఈ క్రమంలో తన టూర్‌కు సంబంధించిన ఫొటోలను.. ‘‘గత రెండు వారాల్లో నాకు ఇష్టమైన పనులతో ఇలా గడిచింది’’ అనే క్యాప్షన్‌తో పంచుకున్నారు.

కాగా సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. షోయబ్‌ పాక్‌ నటి సనా జావెద్‌ను పెళ్లాడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. సనాను వివాహం చేసుకున్నానంటూ షోయబ్‌ మాలిక్‌ ఫొటోలు విడుదల చేసిన తర్వాత.. సానియా కుటుంబం స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని తెలియజేసింది.

ఈ నేపథ్యంలో షోయబ్‌ మాలిక్‌ వివాహేతర సంబంధాల కారణంగానే సానియా ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. ఖులా ద్వారా తానే స్వయంగా అతడితో బంధం నుంచి విముక్తి పొందినట్లు పేర్కొన్నాయి. 

ఈ నేపథ్యంలో జీవితంలోని కఠిన దశను దాటే క్రమంలో సానియా మీర్జా తనకోసం తాను ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. దుబాయ్‌ పర్యటనలో భాగంగా సానియా మీర్జా పాక్‌ సింగర్‌ అతిఫ్‌ అస్లాం లైవ్‌ కన్సర్ట్‌కు హాజరయ్యారు. అస్లాం, అతడి భార్య సారాతో కలిసి లంచ్‌కు వెళ్లి క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేశారు. 

కాగా పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ను సానియా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు దుబాయ్‌లో కాపురం ఉన్నారు. అయితే, ఆట నుంచి విరామం తీసుకున్న తర్వాత షోయబ్‌తో కలిసి ఎక్కువ సమయం గడిపే క్రమంలో.. అతడి గురించి నిజాలు తెలియడంతోనే.. ఆమె అతడి నుంచి విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఇక సానియాకు దుబాయ్‌లో టెన్నిస్‌ అకాడమీ ఉంది. ప్రస్తుతం అకాడమీ కార్యకలాపాలతో ఆమె బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement