Ind vs Pak: బావగారూ.. బావగారూ అంటూ ఫ్యాన్స్‌ కేకలు.. వీడియో షేర్‌ చేసిన సానియా | T20 World Cup 2021 Ind Vs Pak: Sania Mirza On Fans Call Shoaib Malik Jija Ji | Sakshi
Sakshi News home page

Sania Mirza: బావగారూ.. బావగారూ అంటూ ఫ్యాన్స్‌ కేకలు.. వీడియో షేర్‌ చేసిన సానియా

Published Tue, Oct 26 2021 9:53 AM | Last Updated on Tue, Oct 26 2021 11:51 AM

T20 World Cup 2021 Ind Vs Pak: Sania Mirza On Fans Call Shoaib Malik Jija Ji - Sakshi

Photo Source: Social Media

Sania Mirza Reacts After Fans Call Shoaib Malik ‘jeeja ji’: సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌.. ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే చాలు... దాయాదుల పోరు గురించే కాదు.. ఈ జంట గురించి కూడా నెట్టింట చర్చ జరుగుతుంది... ఒక్కోసారి రచ్చ కూడా అవుతుంది.. అందుకే అక్టోబరు 24 నాటి భారత్‌- పాక్‌ పోరుకు ముందు తాను సోషల్‌ మీడియా నుంచి మాయమైపోతానంటూ సానియా మీర్జా ఓ వీడియో షేర్‌ చేశారు కూడా. అందుకు గల కారణాల గురించి ఇప్పుడు ప్రస్తావన అనవసరం.

అయితే.. సోమవారం ఆమె పంచుకున్న వీడియో మాత్రం ఎంతో హృద్యంగా ఉంది. ఆదివారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి సేన బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న షోయబ్‌ మాలిక్‌ను ఉద్దేశించి... కొంతమంది అభిమానులు.. ‘‘బావగారూ.. బావగారూ..’’ అంటూ సంతోషంతో కేకలు వేశారు. 

ఈ వీడియోను సానియా మీర్జా రీషేర్‌ చేయగా... నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. అభిమానులు.. ‘‘ఇది చాలా క్యూట్‌గా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సానియా మీర్జా సైతం.. స్మైలింగ్‌ ఎమోజీలతో పాటు రెండు హార్ట్‌ సింబల్స్‌ జతచేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ 2018లో కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఇక మాలిక్‌ కెరీర్‌ విషయానికొస్తే చాలా కాలంగా జట్టుకు దూరమైన షోయబ్‌ మాలిక్‌కు అనూహ్యంగా టీ20 వరల్డ్‌కప్‌ ఆడే జట్టులో ఆఖరి నిమిషంలో చోటు దక్కింది. సోహైబ్‌ మక్సూద్‌కు గాయం కావడంతో అతడి స్థానంలో మాలిక్‌ జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉండగా... ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో తమ పరాజయాల పరంపరకు బ్రేక్‌ వేస్తూ.. పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మెంటార్‌ ధోని పాక్‌ ఆటగాళ్లను అభినందిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటుకున్న ఫొటోలు వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. 

చదవండి: Rashid Khan: కన్నీటి పర్యంతమైన నబీ.. రషీద్‌ ఖాన్‌ భావోద్వేగ పోస్టు..
T20 World Cup 2021 Ind vs Pak: ఓటమి అనంతరం కోహ్లి అలా.. ధోని ఇలా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement