చార్ల్స్‌టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలో ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 2–6, 6–4, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో నాలుగో సీడ్ మాగ్దా లినెట్ (పోలాండ్)–ఆంద్రియా క్లెపాచ్ (స్లొవేనియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.
ఫైనల్లో ఓడిన సానియా–హర్డెస్కా జోడీకి 25,900 డాలర్ల (రూ. 19 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 305 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
సాకేత్‌కు పదో టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్‌లో పదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈక్వెడార్‌లో ఆదివారం ముగిసిన సాలినాస్ ఓపెన్ టోర్నీలో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జంట పురుషుల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది.
ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 4–6, 6–3, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’ లో రెండో సీడ్ అరగాన్ (అమెరికా) –రొబెర్టో క్విరోజ్ (ఈక్వెడార్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
చదవండి: IPL 2022: స్టొయినిస్ ఆటలు సాగనివ్వని కుల్దీప్... లక్నో జోరుకు బ్రేక్!
Comments
Please login to add a commentAdd a comment