
టోక్యో: ఒలింపిక్స్ పతకాల వేటలో ఈసారి భారత టెన్నిస్ క్రీడాకారులకు ఆరంభం నుంచే కఠిన సవాల్ ఎదురుకానుంది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా–అంకిత రైనా జంట తొలి రౌండ్‌లో నదియా–లైద్మిలా కిచెనోక్ (ఉక్రెయిన్) జంటతో తలపడనుంది. ఒకవేళ తొలి రౌండ్ అడ్డంకిని సానియా ద్వయం అధిగమిస్తే రెండో రౌండ్‌లో ఎలీనా వెస్నినా–వెరోనికా కుదెర్మెతోవా (రష్యా ఒలింపిక్ కమిటీ) జోడీతో ఆడే అవకాశముంది. వెస్నినా 2016 రియో ఒలింపిక్స్‌లో మకరోవా జోడీగా మహిళల డబుల్స్‌లో స్వర్ణం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ సుమిత్ నగాల్ తొలి రౌండ్లో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)తో ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment