
భారత టెన్నిస్‌లో తొలి డోపీ పట్టుబడ్డాడు. 16 ఏళ్ల టీనేజ్ కుర్రాడు ఆర్యన్ భాటియా... గతేడాది ఢిల్లీలో జరిగిన ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్ సందర్భంగా నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ పరీక్షల్లో తేలింది. వెంటనే అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే అఖిల భారత టెన్నిస్ సంఘం కార్యదర్శి హిరణ్మయ్ ఛటర్జీ మాట్లాడుతూ ఆర్యన్ కావాలని ఉత్ప్రేరకాలు తీసుకోలేదని, జలుబుతో బాధపడుతుండగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో వేసుకున్న మెడిసిన్ ద్వారా ఈ సమస్య తలెత్తిందని వెల్లడించారు. దీనిపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment