![I did not make a mistake: Gottlie - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/20/GATLIN-0608434.jpg.webp?itok=9RioRz1y)
లండన్: ప్రపంచ స్ప్రింట్ చాంపియన్ జస్టిన్ గాట్లిన్ తన శిక్షణ సిబ్బంది నిర్వాకంపై స్పందించాడు. ఓ బ్రిటిష్ దినపత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో తన కోచ్ మిచెల్, ఏజెంట్ వాగ్నర్ ఇద్దరు నిషేధిత ఉత్ప్రేరకాలు అమ్మేందుకు సిద్ధపడినట్లు తేలింది. ఈ వీడియో టేపులు అథ్లెట్ వర్గాల్లో పెను దుమారం రేపింది. దీనిపై 35 ఏళ్ల అమెరికన్ స్ప్రింట్ స్టార్ గాట్లిన్ మాట్లాడుతూ... వారిద్దరి నిర్వాకంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు.
‘నా కోచ్, ఏజెం ట్ ఈ డోపింగ్ స్కామ్‌లో ఉండటం చూసి... నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ఆశ్చర్యపోయా. వెంటనే వాళ్లిద్దరిని తొలగించా. నేను మాత్రం ఏ తప్పూ చేయలేదు. ఇప్పటికే రెండు సార్లు డోపీగా శిక్ష అనుభవించిన నేను మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు’ అని గాట్లిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment