
‘బి’ శాంపిల్ టెస్టుకూ హాజరుకాని సుబ్రతా పాల్
డోపింగ్‌లో విఫలమైన భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ సుబ్రతా పాల్ తన ‘బి’ శాంపిల్ టెస్టుకు కూడా హాజరుకాలేదు.
న్యూఢిల్లీ: డోపింగ్‌లో విఫలమైన భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ సుబ్రతా పాల్ తన ‘బి’ శాంపిల్ టెస్టుకు కూడా హాజరుకాలేదు. ‘ఎ’ శాంపిల్‌లో తను నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్టు తేలిన విషయం తెలిసిందే. అయితే ‘బి’ శాంపిల్ టెస్టులో తానేమిటో తెలుస్తుందని అతను అప్పీల్ చేసుకోగా... సోమవారంలోగా హాజరు కావాలని జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (నాడా) దీనికి తుది గడువునిచ్చింది.
కానీ స్వతంత్ర ప్రభుత్వ పరిశీలకుని ఆధ్వర్యంలో జరిగే ఈ టెస్టుకు పాల్ అనూహ్యంగా దూరమయ్యాడు. ఈ పరీక్షకు హాజరుకాకుండా తనకు మరికొంత సమయం గడువు కావాలని కోరాడు. దీంతో సుబ్రతా పాల్ ఉద్దేశపూర్వకంగానే డ్రగ్స్‌ను వాడినట్లుగా ఉందని పలువురు అనుమానిస్తున్నారు.