
ఢిల్లీ: చిత్రవిచిత్రమైన పనులు చేయడంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) రూటే సపరేటు. డోపింగ్‌లో సస్పెన్షన్‌కు గురైన క్రికెటర్‌ను దులీప్ ట్రోఫీకి ఎంపిక చేసిన బోర్డు అభాసుపాలైంది. పంజాబ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అభిషేక్ గుప్తాకు ఇండియా రెడ్ జట్టులో చోటు కల్పించారు.
అయితే, అతడి సస్పెన్షన్ సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. కానీ దులీప్ ట్రోఫీ వచ్చే నెల 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. గుప్తా నిషిద్ధ ఉత్ర్పేరకం టర్బుటలిన్ ఉపయోగించినట్టు డోపింగ్ పరీక్షలో బయటపడడంతో అతడిపై జనవరి 15 నుంచి ఎనిమిది నెలలపాటు సస్పెన్షన్ వేటు వేశారు. అయినా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment