డోపింగ్‌లో దొరికిన మన్‌ప్రీత్‌ కౌర్‌ | Asian champion shot-putter Manpreet fails dope test | Sakshi
Sakshi News home page

డోపింగ్‌లో దొరికిన మన్‌ప్రీత్‌ కౌర్‌

Published Thu, Jul 20 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

డోపింగ్‌లో దొరికిన మన్‌ప్రీత్‌ కౌర్‌

డోపింగ్‌లో దొరికిన మన్‌ప్రీత్‌ కౌర్‌

న్యూఢిల్లీ: భారత మేటి అథ్లెట్‌ మన్‌ప్రీత్‌ కౌర్‌ డోపింగ్‌లో పట్టుబడింది. ఇటీవలే భువనేశ్వర్‌లో జరిగిన ఆసి యా చాంపియన్‌షిప్‌లో ఆమె షాట్‌పుట్‌లో స్వర్ణం గెలిచింది. లండన్‌లో వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కూ అర్హత సంపాదించింది. ఇప్పుడు స్వర్ణం, బెర్త్‌ రెండూ కోల్పోయే పరిస్థితి తలెత్తింది.

గత నెలలో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ సందర్భంగా ఆమె నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా...  ‘ఎ’ శాంపిల్‌లో నిషిద్ధ డిమిథైల్‌బుటిలమైన్‌ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. తదుపరి ‘బి’ శాంపిల్‌ కూడా ఇలాగే పాటిజివ్‌ రిపోర్టు వస్తే ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య అధికారి అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement