వెస్టిండీస్ బ్యాటర్ జాన్ కాంప్‌బెల్‌పై జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ నాలుగేళ్ల నిషేధం విధించింది. డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ తెలిపింది. అదే విధంగా డోపింగ్ పరీక్షల కోసం కాంప్‌బెల్ తన రక్త నమూనాలను కూడా ఇవ్వడానికి నిరాకరించాడని కమీషన్ ఆరోపించింది.
"కాంప్‌బెల్ డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించాడు. జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ నియమం 2.3ను అతడు అతిక్రమించాడు. అయితే తమకు లభించిన ఆధారాలు ప్రకారం కాంప్‌బెల్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించలేదు.
అయినప్పటికీ జాడ్కో నియమం10.3.1 ప్రకారం అతడిపై 4 ఏళ్ల నిషేదం విధించబడుతుంది" అని జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కాంప్‌బెల్ ఇప్పటి వరకు విండీస్ తరపున 20 టెస్టులు, 6 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.
చదవండి: Happy Birthday Zaheer Khan: 'దేశంలో చాలా మంది ఇంజనీర్లున్నారు.. నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వు'
Comments
Please login to add a commentAdd a comment