breaking news
John Campbell
-
IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లు జాన్ క్యాంప్‌బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) ఓ అరుదైన ఘనత సాధించారు. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన ఈ ఇద్దరూ.. 51 ఏళ్ల తర్వాత ఓ రికార్డును తిరగరాశారు.1974లో ఇద్దరు విండీస్ ఆటగాళ్లు భారత గడ్డపై ఓ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. 51 ఏళ్ల తర్వాత క్యాంప్‌బెల్, హోప్ ఆ ఫీట్‌ను పునరావృతం చేశారు. నాడు బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్) గార్డన్ గ్రీనిడ్జ్ (107), క్లైవ్ లాయిడ్ (163) సెంచరీలు చేశారు.ఓవరాల్‌గా చూసిన భారత గడ్డపై (భారత్‌పై) ఓ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరు విండీస్ బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారే. 1974కు ముందు 1948-49లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎవర్టన్ వీక్స్ (101), క్లైడ్ వాల్కాట్ (108) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే ఆలౌటై, ఫాలో ఆన్ ఆడుతున్న విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తుంది. వాస్తవానికి తొలి టెస్ట్ తరహాలోనే ఈ మ్యాచ్‌లోనూ విండీస్ ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలవుతుందని అంతా అనుకున్నారు.అయితే క్యాంప్‌బెల్ (115), హోప్ (103) సూపర్ సెంచరీలతో అసమానమైన పోరాటపటిమ కనబర్చి తమ జట్టుకు ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 187 పరుగులు జోడించి, టీమిండియా బ్యాటర్లను రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగేలా చేశారు.నాలుగో రోజు టీ సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి 91 ఆధిక్యంలో ఉంది. జస్టిన్ గ్రీవ్స్ (35), జేడన్ సీల్స్ (18) టీమిండియా బౌలర్ల సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కుల్దీప్ 3, సిరాజ్ 2, జడేజా, సుందర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు ఇన్నింగ్స్‌లో విండీస్, కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలింది. ఆ ఇన్నింగ్స్‌లో అలిక్ అథనాజ్ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: Vaibhav Suryavanshi: వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. -
ఇది అవుట్ అని మీకూ తెలుసు.. కానీ: నవ్వుతూనే ఇచ్చిపడేసిన బుమ్రా
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) మైదానంలో ఎంతో కూల్‌గా ఉంటాడు. బాల్తోనే ప్రత్యర్థి జట్టు బ్యాటర్లతో మాట్లాడతాడు. పదునైన యార్కర్లతో, బౌన్సర్లతో వారిని బోల్తా కొట్టిస్తాడు. అయితే, తాజాగా బుమ్రా కూడా కాస్త సహనం కోల్పోయాడు.అసలేం జరిగిందంటే.. టీమిండియా- వెస్టిండీస్ (IND vs WI 2nd Test) మధ్య శుక్రవారం మొదలైన రెండో టెస్టు.. నాలుగో రోజు ఆటకు చేరుకుంది. 173/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టిన విండీస్.. భోజన విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.జాన్ క్యాంప్‌బెల్ సెంచరీఇక ఆదివారం 87 పరుగులతో క్రీజులో నిలిచిన విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (John Campbell)... సెంచరీ (115) సాధించాడు. అయితే, క్యాంప్‌బెల్ 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ బుమ్రా అతడిని వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నట్లు కనిపించింది.ఎల్బీడబ్ల్యూ కాదుఅయితే, ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్‌వర్త్ మాత్రం తల అడ్డంగా ఉపుతూ ఎల్బీడబ్ల్యూ (Leg Before Wicket) ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో టీమిండియా రివ్యూకి వెళ్లింది. అయితే, రీప్లేలో అల్ట్రాఎడ్జ్ స్పైక్ వచ్చింది. కానీ బంతి ముందుగా ప్యాడ్స్ లేదంటే బ్యాట్‌ను తాకిందా అనేది స్పష్టంగా తెలియలేదు. బంతి అటు బ్యాట్‌కు.. ఇటు ప్యాడ్‌కు అత్యంత సమీపంగా ఉన్నట్లు కనిపించడంతో నిర్ణయం తీసుకోవడం కష్టమైంది.ఈ నేపథ్యంలో థర్డ్ అంపైర్ అలెక్స్ వార్ఫ్ ఇన్సైడ్ ఎడ్జ్ ఉందని.. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండవచ్చని స్పష్టం చేశాడు. దీంతో టీమిండియా రివ్యూ కోల్పోయింది.ఇది అవుట్ అని మీకూ తెలుసుఈ క్రమంలో బుమ్రా తిరిగి బౌలింగ్‌కు వెళ్లే సమయంలో.. ‘‘ఇది అవుట్ అని మీకూ తెలుసు. కానీ సాంకేతికత కూడా దానిని నిరూపించలేదు కదా!’’ అంటూ నవ్వుతూనే అంపైర్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలు స్టంప్ మైకులో రికార్డయ్యాయి. కాగా విండీస్ రెండో ఇన్నింగ్స్ 55వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.ఇక ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 93 ఓవర్ల ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తద్వారా 33 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అంతకుముందు టీమిండియా 518/5 వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. విండీస్ 248 పరుగులకు ఆలౌట్ అయింది.pic.twitter.com/fDtB3GBWPV— crictalk (@crictalk7) October 13, 2025చదవండి: జైస్వాల్ అంటే గిల్‌కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్Trapped! 🕸#RavindraJadeja gets the all-important wicket of centurion #JohnCampbell. 💪Catch the LIVE action 👉 https://t.co/WbUGnskEdz#INDvWI 👉 2nd Test, Day 4 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/eHUVezgNs2— Star Sports (@StarSportsIndia) October 13, 2025 -
ఢిల్లీ టెస్టు.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న వెస్టిండీస్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టీమిండియా(Teamindia)తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్‌తో పోరాడుతోంది. ఫాలో ఆన్‌లో విండీస్ బ్యాటర్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. నాలుగో రోజు లంచ్ బ్రేక్ సమయానికి కరేబియన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.ప్రస్తుతం ఫాలో ఆన్‌లో వెస్టిండీస్ ఇంకా 28 పరుగులు వెనకబడి ఉంటుంది. క్రీజులో షాయ్ హోప్(92), కెప్టెన్ రోస్టన్ ఛేజ్(23) ఉన్నారు. ఫస్ట్ సెషన్లో విండీస్ 79 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ అద్బుతమైన సెంచరీ సాధించాడు. 199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 115 పరుగులు చేసిన క్యాంప్‌బెల్.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అంతకుముందు పర్యాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాల్ ఆన్ గండాన్ని విండీస్ తప్పంచుకోలేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 82 పరుగులిచ్చి 5 వికెట్లు, రవీంద్ర జడేజా 46 పరుగులిచ్చి 3 తీశారు. వీరిద్దరితో బుమ్రా, సిరాజ్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసింది.చదవండి: Vaibhav Suryavanshi: వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ.. -
భారత్‌తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (India vs West Indies) పర్యాటక వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. ఒటమి ఖరారు చేసుకొనే, రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఊహించిన విధంగానే 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్‌బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్యాంప్‌బెల్ 87, హోప్ 66 పరుగులతో అజేయంగా ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయమైన 138 పరుగులు జోడించారు. విండీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్‌నరైన్ చంద్రపాల్‌ను (10) సిరాజ్.. అలిక్ అథనాజ్ను (7) వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశారు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పతనమైంది. 41 పరుగులు చేసిన అథనాజ్ టాప్ స్కోరర్ కాగా.. చంద్రపాల్ (34), జాన్ క్యాంప్‌బెల్ (10), షాయ్ హోప్ (36), టెవిన్ ఇమ్లాచ్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17), ఖారీ పియెర్ (23), ఆండర్సన్ ఫిలిప్ (24 నాటౌట్), జేడన్ సీల్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజాతో పాటు సిరాజ్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్‌కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్..
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Teamindia) కు ఊహించని షాక్ తగిలింది. యువ ఆటగాడు సాయి సుదర్శన్(Sai Sudharsan)కు గాయపడ్డాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా సుదర్శన్ చేతి వేలికి బంతి బలంగా తాకింది.7 ఓవర్ వేసిన రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రెండో బంతిని జాన్ క్యాంప్‌బెల్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా సంధించాడు. ఆ బంతిని క్యాంప్‌బెల్ స్లాగ్ స్వీప్ ఆడాడు. షాట్ కనక్ట్ అయినప్పటికి బంతి షార్ట్ లెగ్‌లో ఉన్న సుదర్శన్ చేతిలోకి వెళ్లింది. బంతి చేతికి బలంగా తాకినప్పటికి సుదర్శన్ మాత్రం అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆ క్యాచ్ చూసి బ్యాటర్‌తో పాటు మైదానంలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. అయితే బంతిని అందుకునే క్రమంలో అతడి చిటికెన వేలుకు గాయమైంది. దీంతో నొప్పితో అతడు విల్లవిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడు నొప్పి తగలేదు.ఆఖరికి ఫిజియో సాయంతో అతడు మైదానాన్ని వీడాడు. అతడి గాయం తీవ్రత తెలియాల్సి ఉంది. సుదర్శన్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.టీమిండియా భారీ స్కోర్..ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. రెండో రోజు ఆటలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(175), శుబ్‌మన్ గిల్(129 నాటౌట్) అద్బుత సెంచరీలతో చెలరేగారు. సుదర్శన్(87, జురెల్ (44) ఔట్, నితీష్(43), రాహుల్(38) రాణించారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. రోస్టన్ ఛేజ్ మరో వికెట్ పడగొట్టాడు.చదవండి: శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్What a grab by Sai Sudharsan! Unbelievable 🤯Sunil Gavaskar in the commentary background: 'He caught it, he caught iitttt!pic.twitter.com/7cVpUn48mo— GillTheWill (@GillTheWill77) October 11, 2025 -
IND vs WI Day 3: ట్విస్ట్ ఇచ్చిన టీమిండియా!
వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా (IND vs WI 1st Test) తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఊహించని రీతిలో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో విండీస్ బ్యాటింగ్‌కు దిగింది.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా సొంతగడ్డపై టీమిండియా.. విండీస్‌తో రెండు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం మొదటి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక విండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది.భారత బౌలర్ల విజృంభణభారత బౌలర్ల ధాటికి.. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 44.1 ఓవర్లలో కేవలం 162 పరుగులు మాత్రమే చేసి వెస్టిండీస్ జట్టు కుప్పకూలింది. ఓపెనర్లు జాన్ కాంప్‌బెల్ (8), తగ్‌నరైన్ చందర్‌పాల్ (0)లతో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ అలిక్ అథనాజ్ (12) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.మిగతా వారిలో బ్రాండన్ కింగ్ (13), ఖరీ పియరీ (11) రెండంకెల స్కోరు చేయగా.. కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (24), షాయీ హోప్ (26) ఫర్వాలేదనిపించారు. ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ 32 పరుగులతో విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.టీమిండియా బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) నాలుగు వికెట్లతో చెలరేగగా.. బుమ్రా మూడు, కుల్దీప్ యాదవ్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. బౌలర్లు ఇలా తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేసి ప్రత్యర్థిని కట్టడి చేయగా.. బ్యాటర్లు కూడా విజృంభించారు.ముగ్గురు మొనగాళ్లుఓపెనర్ కేఎల్ రాహుల్ (100)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (125), ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (104 నాటౌట్) శతకాలతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 50 పరుగులు చేయగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36) నిరాశపరిచాడు. ఇటీవల సూపర్ ఫామ్ కనబరిచిన సాయి సుదర్శన్ (7) మాత్రం ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి.. విండీస్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 286 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుకాగానే తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వేట మొదలుపెట్టిన సిరాజ్ఫలితంగా విండీస్ తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొమ్మిది ఓవర్ల ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఓపెనర్ తగ్‌నరైన్ చందర్‌పాల్ (8) మరోసారి విఫలం అయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో నితీశ్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక మరో ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ 12, అలిక్ అథనాజ్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఏకైక ఆటగాడిగా.. -
వెస్టిండీస్ క్రికెటర్‌పై నాలుగేళ్ల నిషేధం..
వెస్టిండీస్ బ్యాటర్ జాన్ కాంప్బెల్పై జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ నాలుగేళ్ల నిషేధం విధించింది. డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ తెలిపింది. అదే విధంగా డోపింగ్ పరీక్షల కోసం కాంప్‌బెల్ తన రక్త నమూనాలను కూడా ఇవ్వడానికి నిరాకరించాడని కమీషన్ ఆరోపించింది. "కాంప్‌బెల్ డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించాడు. జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ నియమం 2.3ను అతడు అతిక్రమించాడు. అయితే తమకు లభించిన ఆధారాలు ప్రకారం కాంప్‌బెల్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించలేదు. అయినప్పటికీ జాడ్కో నియమం10.3.1 ప్రకారం అతడిపై 4 ఏళ్ల నిషేదం విధించబడుతుంది" అని జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కాంప్‌బెల్ ఇప్పటి వరకు విండీస్ తరపున 20 టెస్టులు, 6 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. చదవండి: Happy Birthday Zaheer Khan: 'దేశంలో చాలా మంది ఇంజనీర్లున్నారు.. నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వు'


