‘క్లీన్‌చిట్’ను సమీక్షిస్తాం
నర్సింగ్ వివాదంపై ‘వాడా’ ప్రకటన
న్యూఢిల్లీ: డోపింగ్ వివాదంనుంచి బయట పడ్డానని ఆనందంలో ఉన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు మరో పరీక్ష ఎదురైంది. నర్సింగ్ నిర్దోషి అంటూ జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇచ్చిన క్లీన్‌చిట్‌పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) స్పందించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని తాము మరోసారి సమీక్షిస్తామని ‘వాడా’ ప్రకటించింది. ‘ఈ కేసుకు సంబంధించిన ఫైల్‌కు మాకు పంపమని ‘నాడా’ను కోరాం. మేం దీనిని మరోసారి సమీక్షిస్తాం.
ఇప్పుడే ఇంకా ఏమీ చెప్పలేం’ అని వాడా ఉన్నతాధికారి మ్యాగీ డ్యురాంగ్ వెల్లడించారు. మరోవైపు నర్సింగ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. ఎలాంటి ఆందోళనా లేకుండా దేశానికి పతకం తెచ్చేలా దృష్టిపెట్టాలని మోదీ సూచించారని చెప్పాడు.